అప్రమత్తంగా ఉండండి -ఎంపీ నామా
దిశ, ఖమ్మం :రానున్న 24 గంటల్లో తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండనున్నదని వాతవారణ శాఖ హెచ్చరికలు జారి చేసింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ, ముందు జాగ్రత్త చర్యలను అధికారులు చేపట్టాలని ఎంపీ నామా నాగేశ్వరరావు సూచించారు. ఇప్పటికే నాలుగు రోజులుగా వర్షం కురుస్తోందన్నారు. దీంతో శిథిలావస్థలో ఉన్న ఇండ్లతో పాటు లోతట్టు ప్రాంతల్లో ఉన్న ప్రజలను అవసరమైతే తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించాని అధికారులను ఆయన ఆదేశించారు. వరదల వల్ల […]
దిశ, ఖమ్మం :రానున్న 24 గంటల్లో తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండనున్నదని వాతవారణ శాఖ హెచ్చరికలు జారి చేసింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ, ముందు జాగ్రత్త చర్యలను అధికారులు చేపట్టాలని ఎంపీ నామా నాగేశ్వరరావు సూచించారు.
ఇప్పటికే నాలుగు రోజులుగా వర్షం కురుస్తోందన్నారు. దీంతో శిథిలావస్థలో ఉన్న ఇండ్లతో పాటు లోతట్టు ప్రాంతల్లో ఉన్న ప్రజలను అవసరమైతే తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించాని అధికారులను ఆయన ఆదేశించారు. వరదల వల్ల నష్టపోయిన ప్రతిఒక్కరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. పంట నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు.
టీఆర్ ఎస్ ప్రభుత్వం ఎప్పడూ రైతు పక్షపాతి గానే ఉంటుందని పేర్కొన్నారు. వరదల మూలంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఖమ్మం నగరాన్ని ఆనుకొని ఉన్న మున్నేరు, కొత్తగూడెం ముర్రేడువాగు ఉధృతంగా ప్రవహిస్తున్నందున పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. తుఫాను కారణంగా దెబ్బతిన్న రహదారులును వెంటనే మరమ్మతులు చేయాలని ఎంపీ సూచించారు.