రాజధానిపై బీజేపీ స్టాండ్ మారదు: జీవీఎల్

దిశ, వెబ్ డెస్క్: ఏపీకి రాజధానిగా అమరావతే ఉండాలని ఇప్పటికీ బీజేపీ కోరుకుంటుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ అన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటును తాము మొదటి నుంచి స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. రాజధాని అంశం కేంద్ర పరిధిలోకి రాదని అన్నారు. కొన్ని పార్టీలు అధికారంలో ఉంటే గవర్నర్ నిర్ణయాన్ని ప్రశ్నిస్తారని.. అదే ప్రతిపక్షంలో ఉంటే గవర్నర్‌కు ఆ అధికారాలు ఉండని అంటారని పరోక్షంగా టీడీపీని ఎద్దేవా చేశారు. అమరావతి కోసం రైతులు 33 వేల ఎకరాల భూమిని ఇచ్చారన్నారు. […]

Update: 2020-07-31 08:14 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీకి రాజధానిగా అమరావతే ఉండాలని ఇప్పటికీ బీజేపీ కోరుకుంటుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ అన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటును తాము మొదటి నుంచి స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. రాజధాని అంశం కేంద్ర పరిధిలోకి రాదని అన్నారు. కొన్ని పార్టీలు అధికారంలో ఉంటే గవర్నర్ నిర్ణయాన్ని ప్రశ్నిస్తారని.. అదే ప్రతిపక్షంలో ఉంటే గవర్నర్‌కు ఆ అధికారాలు ఉండని అంటారని పరోక్షంగా టీడీపీని ఎద్దేవా చేశారు. అమరావతి కోసం రైతులు 33 వేల ఎకరాల భూమిని ఇచ్చారన్నారు. వారికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. శాసన రాజధానిగా అమరావతి ఉంటే అభివృద్ధి చెందదని. పూర్తి స్థాయి రాజధానిగా ఉంటేనే అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.

Tags:    

Similar News