జగిత్యాల వాసి ఆచూకీ కోసం విదేశాంగశాఖకు బండి రిక్వెస్ట్..

దిశ, కరీంనగర్ సిటీ : అప్పు చేసి పొట్టకూటి కోసం అబుదాబికి వెళ్లి అదృశ్యమైన కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని జగిత్యాల జిల్లా వాసి ఆచూకీ తెలుసుకుని స్వదేశానికి తీసుకొచ్చేందుకు సాయం చేయాలని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్‌ను కరీంనగర్ ఎంపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కోరారు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని మున్నెగూడెం గ్రామానికి చెందిన శ్రీరాముల హరిప్రసాద్ కుటుంబ పోషణ కోసం గతేడాది డిసెంబర్‌ 27న అబుదాబి వెళ్లాడు. అప్పటి […]

Update: 2021-06-25 11:01 GMT

దిశ, కరీంనగర్ సిటీ : అప్పు చేసి పొట్టకూటి కోసం అబుదాబికి వెళ్లి అదృశ్యమైన కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని జగిత్యాల జిల్లా వాసి ఆచూకీ తెలుసుకుని స్వదేశానికి తీసుకొచ్చేందుకు సాయం చేయాలని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్‌ను కరీంనగర్ ఎంపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కోరారు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని మున్నెగూడెం గ్రామానికి చెందిన శ్రీరాముల హరిప్రసాద్ కుటుంబ పోషణ కోసం గతేడాది డిసెంబర్‌ 27న అబుదాబి వెళ్లాడు. అప్పటి నుంచి స్వదేశంలోని కుటుంబసభ్యులతో తన క్షేమ సమాచారాన్ని ఫోన్ ద్వారా తెలియజేసేవారు. కానీ, జనవరి 19న తన రూమ్ నుంచి బయటకు వెళ్లిన హరిప్రసాద్‌ కనిపించకుండా పోయాడు. ఆయన కుటుంబ సభ్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎలాంటి సమాచారం లభించకపోవడంతో పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన ఆయన తక్షణమే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి హరిప్రసాద్ ఆచూకీ తెలుసుకొని స్వదేశానికి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్‌ను కోరినట్లు శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Tags:    

Similar News