‘మోదీ భూమిపూజకు వెళ్లడం రాజ్యాంగ విరుద్ధం’
దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీపై ఎంఐంఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. అయోధ్య రామమందిరం నిర్మాణానికి ఆగస్టు 5న భూమి పూజ కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి రామ జన్మభూమి ట్రస్టు సభ్యులు ప్రధాని మోదీ, అన్ని రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం పంపారు. కాగా, ఈ కార్యక్రమానికి మోదీ హాజరవుతున్న విషయం తెలిసిందే. భారత ప్రధాని ఈ కార్యక్రమానికి హాజరు కావడంపై అసదుద్దీన్ ఖండించారు. […]
దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీపై ఎంఐంఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. అయోధ్య రామమందిరం నిర్మాణానికి ఆగస్టు 5న భూమి పూజ కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి రామ జన్మభూమి ట్రస్టు సభ్యులు ప్రధాని మోదీ, అన్ని రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం పంపారు. కాగా, ఈ కార్యక్రమానికి మోదీ హాజరవుతున్న విషయం తెలిసిందే.
భారత ప్రధాని ఈ కార్యక్రమానికి హాజరు కావడంపై అసదుద్దీన్ ఖండించారు. లౌకికవాదం రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలో ఓ భాగమని గుర్తు చేసిన ఓవైసీ.. అయోధ్య రామాలయానికి పునాదిరాయి వేసే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకావడం ‘రాజ్యాంగ ప్రమాణ ఉల్లంఘన’ అని ట్వీట్ చేశారు. 1992లో బాబ్రీ మసీదుపై మూక దాడి చేశారని.. అంతకు ముందు 400 ఏళ్ల పాటు మసీదు ఉన్నది ఆ స్థలంలోనే అని చెప్పారు. అధికారిక పదవిలో ఉండి భూమి పూజకు హాజరుకావడం భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లేనని ఓవైసీ అభిప్రాయం వ్యక్తం చేశారు.