కేంద్ర నిధులు.. రాష్ర్టం డబ్బా : ఎంపీ అర్వింద్

దిశ, నిజామాబాద్: కరోనా కాలంలో కేంద్రం ఇచ్చిన రూ.1500 నగదు, ప్రతి ఒక్కరికి 12 కిలోల బియ్యం రాష్ర్ట ప్రభుత్వం తాను ఇచ్చినట్టుగా ప్రచారం చేసుకుందని, అందులో రాష్ర్ట ప్రభుత్వానికి సంబంధించింది ఒక్క రూపాయి కూడా లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… లాక్‌డౌన్ కాలంలో కేంద్రం వలస కార్మికులకు, రేషన్ కార్డు లేని వారికి కోసం రాష్ర్టానికి రూ.599 […]

Update: 2020-06-26 08:03 GMT

దిశ, నిజామాబాద్: కరోనా కాలంలో కేంద్రం ఇచ్చిన రూ.1500 నగదు, ప్రతి ఒక్కరికి 12 కిలోల బియ్యం రాష్ర్ట ప్రభుత్వం తాను ఇచ్చినట్టుగా ప్రచారం చేసుకుందని, అందులో రాష్ర్ట ప్రభుత్వానికి సంబంధించింది ఒక్క రూపాయి కూడా లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… లాక్‌డౌన్ కాలంలో కేంద్రం వలస కార్మికులకు, రేషన్ కార్డు లేని వారికి కోసం రాష్ర్టానికి రూ.599 కోట్లు ఇస్తే జిల్లాలో 14400 మంది వలస కార్మికులకు రూ.21 లక్షలు మాత్రమే ఖర్చు చేసిందని విమర్శించారు. వైద్య సేవలు, మౌళిక సదుపాయాల కోసం కేంద్రం రాష్ట్రానికి రూ.500 కోట్లు ఇస్తే నిజామాబాద్ జిల్లాకు రాష్ర్ట ప్రభుత్వం ఇచ్చింది సున్నా అన్నారు. అవే నిధులను తమ ఖాతాలో వేసుకుని ప్రజలకు రూ.1500 ఇచ్చి సొంత డబ్బులు ఇచ్చినట్టు ప్రభుత్వం డబ్బా కొట్టుకుందని విమర్శించారు. 12 కిలోల బియ్యం కుడా అత్మ నిర్బర్ భారత్ నుంచి వచ్చినవే అని, రాష్ర్ట ప్రభుత్వం ఏం ఇవ్వలేదని అన్నారు. స్టేట్ రోడ్ ఫండ్ కింద నాలుగేండ్ల కాలంలో జిల్లాకు వచ్చిన రూ.200 కోట్లను కాళేశ్వరం, మీషన్ భగీరథ పథకానికి దారి మళ్లించారని అన్నారు. రోడ్లు భవనాల శాఖమంత్రి ప్రశాంత్ రెడ్డి ఉన్న జిల్లాలో కేంద్రం నిధులతో చేసిన పనులకు రాష్ర్ట ప్రభుత్వం బ్యాంకుల వద్ద ఎలా రుణాలు తీసుకుందని ప్రశ్నించారు. పసుపు రైతులకు మద్దతు ధర ఇప్పిస్తానని అన్నా, తనకు ఎవరూ సహకరించలేదని ఎంపీ అర్వింద్ ఆవేదన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News