ఈ మూవీతో నాపై మీ అభిప్రాయం మారుతుంది.. సన్నీ లియోన్ కామెంట్స్ వైరల్

సన్నీ లియోన్, ప్రియమణి, జాకీ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కొటేషన్ గ్యాంగ్ (QG)’.

Update: 2024-06-30 09:52 GMT

దిశ, సినిమా: సన్నీ లియోన్, ప్రియమణి, జాకీ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కొటేషన్ గ్యాంగ్ (QG)’. వివేక్ కుమార్ కన్నన్ దర్శకత్వం వహించిన ఈ మూవీని ఫిల్మినాటి ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై నిర్మాత గాయత్రి సురేష్ నిర్మిస్తున్నారు. జులైలో విడుదల కానున్న ఈ చిత్రం నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఎంతో వైలెంట్‌గా ఉన్న ట్రైలర్‌లో ప్రియమణి, సన్నీ లియోన్, జాకీ ష్రాఫ్ యాక్షన్ సీన్స్, డైలాగ్స్ అదరహో అనిపించాయి.

ఇక సినిమా రిలీజ్ సమయం దగ్గర పడటంతో వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు చిత్ర బృందం. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సన్నీ లియోన్.. సినిమా గురించి పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘‘కొటేషన్ గ్యాంగ్’ మూవీలో చాలా యాక్షన్ సీన్స్ ఉన్నాయి. వాటిని చూశాక నాపై మీలో ఉన్న అభిప్రాయం మారుతుందని నమ్ముతున్నాను. ఈ మూవీ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. థియేటర్‌కు వెళ్లి మూవీ చూడండి’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రజెంట్ సన్నీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.  

Similar News