డార్లింగ్ మూవీ ప్రమోషన్స్‌లో జోరు పెంచిన నభా నటేష్.. ఏకంగా చార్మినార్ దగ్గర ఆ విధంగా చేస్తూ

టాలీవుడ్ యంగ్ బ్యూటీ నభా నటేస్, ప్రియదర్శి కాంబినేషన్‌లో వస్తు్న తాజా చిత్రం ‘డార్లింగ్’.

Update: 2024-07-02 09:44 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ నభా నటేస్, ప్రియదర్శి కాంబినేషన్‌లో వస్తు్న తాజా చిత్రం ‘డార్లింగ్’. కామెడి ఎంటర్‌టైన్‌మెంట్ కథతో వస్తున్న ఈ చిత్రాన్ని అశ్విన్ మార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్, పోస్టర్స్, ఫస్ట్ లిరికల్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. ఈ సినిమా జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ సమయం కూడా దగ్గర పడటంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు మేకర్స్.

ఈ సందర్భంగా ఈరోజు ఉదయం హైదరాబాద్‌లోని చార్మినార్ దగ్గర సందడి చేసింది నభా నటేష్. అంతే కాకుండా సోషల్ మీడియా వేదికగా లైవ్ ఇచ్చి అభిమానులతో ముచ్చటించింది. అలాగే సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. కాగా.. తాజాగా ‘డార్లింగ్’ నుంచి మేకర్స్ సెకండ్ సింగిల్ రిలీజ్ చేయగా.. మెలోడీ, సోలో అడ్వెంచర్ ఎంజాయ్ చేసే విధంగా ఉన్న ఈ సాంగ్ నెట్టింట మంచి రెస్పాన్స్ దక్కించుకుంటుంది.

Similar News