రిలీజైన 15 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన అఖిల్ మూవీ

అఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది

Update: 2024-07-04 10:32 GMT

దిశ, సినిమా: అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ గతేడాది ఏప్రిల్ 28న విడుదలై అఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ చిత్రానికి నిర్మాతలు భారీగా డబ్బును పెట్టారు. అఖిల్ కూడా సినిమా కోసం చాలా కష్టపడ్డాడు, రాత్రి పగలు తేడా లేకుండా డైట్ చేస్తూ శ్రమించాడు. అయినా ప్రయోజనం లేదు.

ఈ మూవీ పై పెట్టుకున్న చాలా ఆశలన్ని అడియాసలు అయ్యాయి. ఏజెంట్ ఫ్లాప్ అవ్వడంతో అఖిల్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. చాలా రోజులు అజ్ఞాతంలోనే ఉన్నాడు. అతను తన తదుపరి చిత్రాన్ని కూడా ప్రకటించలేదు, ఇది 2023 ఏప్రిల్‌లో విడుదలైంది.

సినిమా విడుదలైన మొదటి రోజే నెగిటివ్ కామెంట్స్ రావడంతో చాలా మంది ప్రేక్షకులు థియేటర్లలో సినిమాను చూడలేదు. ఓటీటీకి వస్తుందా అని చాలా రోజులు ఎదురుచూశారు. స్ట్రీమింగ్ కు వస్తుందని ఇంతకు ముందు పుకార్లు వచ్చాయి, కానీ రాలేదు. అయితే, జూలైలో ఈ సినిమా OTTలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ త్వరలో సోనీ లైవ్‌లో స్ట్రీమింగ్ కానుంది. 


Similar News