సమంత ఆరోగ్య చిట్కాపై పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు.. డార్క్ రియాలిటీ అంటూ

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొద్ది కాలంగా హెల్త్ ప్యాడ్ కాస్ట్ ద్వారా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు చెబుతున్న విషయం తెలిసిందే.

Update: 2024-07-07 03:22 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొద్ది కాలంగా హెల్త్ ప్యాడ్ కాస్ట్ ద్వారా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు చెబుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు నెబ్యులైజర్ పెట్టుకుని హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను తీసుకోవాలని చెప్పింది. దీంతో సమంతపై డాక్టర్ లివర్ డాక్ ఫైర్ అయ్యాడు. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న ఆమెను జైల్లో పెట్టాలంటూ పలు పోస్టులు పెట్టాడు. అయితే దీనికి వంత పాడుతూ ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తాజ్వాల కూడా సమంతపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ చికిత్సా విధానం అవతలివారికి ఉపయోగపడకపోగా చనిపోతే పరిస్థితేంటి?.. జరగరానిది జరిగితే మీరు బాధ్యత వహిస్తారా? అంటూ ఫైర్ అయ్యారు.

తాజాగా మరో ప్రముఖ నటి పూనమ్ కౌర్ కూడా సమంత ఆరోగ్య చిట్కాపై స్పందించింది. జ్వాల ట్వీట్‌కు రిప్లై ఇచ్చిన ఆమె.. ‘ఇది సెల్ఫ్ గ్లోరిఫికేషన్ జ్వాలా, దేన్ని అయినా అడ్వర్టైజ్ చేసేయొచ్చు అనే దానికి ఉదాహరణ. చాలా మంది ప్రముఖులు చక్కెర తీసుకోరు. కానీ వారు తీసుకోని చక్కెర ఉన్న పానీయాలు, చాక్లెట్ల గురించి విచ్చల విడిగా ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు. ఇదంతా డార్క్ రియాలిటీ’ అని పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది. ప్రస్తుతం పూనమ్ కౌర్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చాలా మంది నెటిజన్లు వీరిని సమర్థిస్తూ కామెంట్లు చేస్తున్నారు.



Similar News