అప్పుడే ఆ పని చేయడానికి రెడీ అయిపోయిన ప్రేమలు బ్యూటీ.. ఫ్యాన్స్‌లో అసహనం

ప్రేమలు బ్యూటీ మమితా బైజు గురించి ఎంత చెప్పినా తక్కువే. మొదటి సినిమాతోనే ఈ ముద్దుగుమ్మ యూత్ డ్రీమ్‌గర్ల్‌గా మారిపోయింది. ప్రేమలు సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ , మొదటి సినిమాతోనే

Update: 2024-07-07 03:02 GMT

దిశ, సినిమా : ప్రేమలు బ్యూటీ మమితా బైజు గురించి ఎంత చెప్పినా తక్కువే. మొదటి సినిమాతోనే ఈ ముద్దుగుమ్మ యూత్ డ్రీమ్‌గర్ల్‌గా మారిపోయింది. ప్రేమలు సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ , మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో ఈ అమ్మడు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఎవరి నోట విన్నా, ఈమె పేరే వినిపిస్తోంది.

టాలీవుడ్‌లో అగ్రహీరోల సరసన నటించి అవకాశం కూడా వచ్చింది. ప్రస్తుతం మమితా రామ్ చరణ్ సినిమాలో నటించబోతుండగా, విజయ్ దేవరకొండ సరసన ఓ సినిమాలో చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ అవుతోంది. నిన్న కాక మొన్ననే చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ చిన్నది అప్పడే ఐటమ్ సాంగ్ చేయడానికి రెడీ అయ్యిందంట. ఈ ముద్దుగుమ్మ మలయాళీ సూపర్ స్టార్ హీరో కొడుకు సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి ఓకే చెప్పినట్లు గుస గుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ ముద్దుగుమ్మపై తన అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇంత త్వరగా ఐటమ్ సాంగ్ చేయడం ఏంటీ అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.


Similar News