ప్రజల ప్రాణాలు పోతే బాధ్యత తీసుకుంటావా.. సమంతపై ఫైర్ అయిన ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఆరోగ్య చిట్కా ఇప్పుడు వివాదాస్పదమవుతోంది.

Update: 2024-07-07 02:37 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఆరోగ్య చిట్కా ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. హైడ్రోజన్ పెరాక్సైడ్ నేబ్యులైజేషన్ వాడకంపై ఈ అమ్మడు సూచించిన చిట్కాపై డాక్టర్లతో పాటు పలువురు ప్రముఖులు తీవ్రంగా మండిపడుతున్నారు. సమంత చెప్పినట్లు చేస్తే ప్రాణాలు పోతాయంటూ ప్రముఖ వైద్య నిపుణులు హెచ్చరించారు. ఈ క్రమంలోనే సమంతపై డాక్టర్ లివర్ డాక్ ఫైర్ అయ్యాడు. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న ఆమెను జైల్లో పెట్టాలంటూ పలు పోస్టులు పెట్టాడు.

అయితే దీనికి వంత పాడుతూ ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తాజ్వాల కూడా సమంతపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘జనాలకు హెల్త్ టిప్స్ ఇస్తున్న సెలబ్రిటీలను నేను ఒకే ఒక్క ప్రశ్న అడగదల్చుకున్నాను. మీ చికిత్సా విధానం అవతలివారికి ఉపయోగపడకపోగా చనిపోతే పరిస్థితేంటి? ఎదుటి వారికి సహాయం చేయాలన్న మీ ఆలోచన మంచిదే.. కాదనను.. కానీ జరగరానిది జరిగితే మీరు బాధ్యత వహిస్తారా? మీకు సలహా ఇచ్చిన డాక్టర్‌ బాధ్యత తీసుకుంటారా?’ అంటూ ట్విట్టర్ వేదికగా సామ్ పై విమర్శలు కురిపించింది జ్వాల. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.




 



Similar News