‘కల్కి’ పార్ట్-2 రిలీజ్ డేట్ చెప్పేసిన నిర్మాత..

ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం కల్కి 2898 AD.

Update: 2024-07-04 09:32 GMT

దిశ, సినిమా: ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం కల్కి 2898 AD. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి అనూహ్యమైన స్పందన లభించింది. అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్, సుప్రీమ్ జాస్కిన్ గా కమల్ హాసన్ ఈ చిత్రంలో అద్భుతంగ నటించారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రలతో అదరగొట్టారు. మొదటి పార్ట్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో కల్కి పార్ట్ 2 పై మరింత అంచనాలను పెరిగాయి.

మొదటి భాగంలోని అనేక ప్రశ్నలకు రెండో భాగంలో సమాధానాలు ఉంటాయని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, నిర్మాత అశ్వినీదత్ ఇటీవలే కల్కి పార్ట్ 2 రిలీజ్ డేట్ గురించి క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏడాది మే లేదా జూన్‌లో సినిమా థియేటర్లలోకి కల్కి పార్ట్ 2 రానుందని అన్నారు.

ఈ అప్డేట్ తో డార్లింగ్ అభిమానులు సంతోషిస్తున్నారు. ఇక సినిమా థియేటర్లలో రన్ అవుతున్న “కల్కి” సినిమా బాక్సాఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది.ఈ సినిమా ఇప్పటి వరకు రూ.700 కోట్లు కలెక్ట్ చేసింది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఫిల్మ్ సోషల్ మీడియాలో కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. విడుదలైన ఏడు రోజుల్లోనే రూ.700 కోట్లు వసూళ్లు చేసి కొత్త రికార్డు క్రియోట్ చేసింది. 


Similar News