మరో డిఫరెంట్ టైటిల్‌తో వచ్చేస్తున్న యంగ్ హీరో.. పోస్టర్ రిలీజ్

వైవిద్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో సుహాస్.

Update: 2024-07-02 09:19 GMT

దిశ, సినిమా: వైవిద్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో సుహాస్. ‘కలర్ ఫొటో, అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్’ వంటి చిత్రాలతో సంచలనం సృష్టించిన ఈ హీరో.. ఇప్పుడు మరో డిఫరెంట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇక యంగ్ హీరో సుహాస్ నటిస్తు్న్న ఈ సినిమా టైటిల్‌ను రివీల్ చేస్తూ.. తాజాగా పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో సుహాస్ ‘జనక అయితే గనక’ అనే సినిమా టైటిల్‌తో ఉన్న పలకను పట్టుకుని దాన్ని ఓరకంటా చూస్తున్నాడు. ఇక టైటిల్‌తో పాటు ఆ పోస్టర్‌లో న్యాయదేవత బొమ్మ, చిన్న పిల్లలకు సంబంధించిన స్కూల్ బ్యాగ్, బస్, టెడ్డీ బేర్ లాంటివి ఉన్నాయి. కాగా.. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తర్వలోనే తెలియజేస్తామని తెలియజేశారు మేకర్స్.

Similar News