మరో లేడీ ఓరియెంటెడ్ మూవీకి ఓకే చెప్పిన స్టార్ హీరోయిన్.. డైరెక్టర్ ఎవరంటే?

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార గతేడాది ‘జవాన్’ మూవీతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చింది.

Update: 2024-07-02 09:13 GMT

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార గతేడాది ‘జవాన్’ మూవీతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చింది. దీంతో సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ వరుస ఆఫర్లు అందుకుంటూ రచ్చ చేస్తుంది. అంతే కాకుండా.. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌కు ప్రాధాన్యం ఇచ్చే ఈ బ్యూటీ.. ఇటీవల ‘అన్నపూరణి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో ఓరియెంటెడ్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట ఈ బ్యూటీ.

వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి ‘మహారాజ’ సినిమాతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న దర్శకుడు నిథిలన్ సామినాథన్ ప్రజెంట్ నెక్ట్స్ ప్రాజెక్టుకు రెడీ అయ్యాడు. తన తదుపరి చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌ లైన్‌ను స్టార్ హీరోయిన్ నయనతారకు వినిపించాడట. స్టోరీ లైన్ బాగుండటంతో అలాగే లేడీ ఓరియెంటెడ్ చిత్రం కావడంతో ఓకే చెప్పేసిందట నయన్. అయితే.. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

Similar News