స్టైలిష్ డ్రెస్ లో అమృత అయ్యర్

హీరోయిన్ అమృత అయ్యర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Update: 2024-07-04 12:51 GMT

దిశ, సినిమా : హీరోయిన్ అమృత అయ్యర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన విజిల్ మూవీలో అమృత అయ్యర్ కీలక రోల్ చేసింది. రెడ్ అనే మూవీతో తెలుగులోకి అడుగుపెట్టిన అమృత.. తమిళ్ లో హిట్ మూవీల్లో నటించి అందర్ని మెప్పించింది. తాజాగా హనుమాన్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ తన ఖాతాలో వేసుకున్న ఈ అమ్మడు..వరుస అవకాశాలతో దూసుకెళ్తుంది. హనుమాన్ మూవీ విజయం సక్సెస్ ఈ ముద్దుగుమ్మ కెరీర్ కి ప్లస్ అయిందని సినీ వర్గాల వారు చెబుతున్నారు.

30 రోజుల్లో ప్రేమించడం ఎలా మూవీతో యాంకర్ ప్రదీప్ కు జోడిగా నటించి మంచి హిట్ అందుకుంది ఈ భామ. ఎంత బిజీగా ఉన్నా ఆమె అభిమానులకు సోషల్ మీడియాతో దగ్గరగానే ఉంటాది. ఇక ఇదే క్రమంలో ట్విట్టర్లో అందమైన ఫోటోలు షేర్ చేస్తూ.. అందరి దృష్టిని ఆకర్షించేలా చేస్తుంది.

తాజాగా, అమృత అయ్యర్ రెడ్ డ్రెస్ ఫోటోలు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. తెలుగు అమ్మాయిలా మెరిసిపోతుంది. ఈ ఫోటోలను చూసిన నెటిజెన్స్ ఎంత ముద్దుగున్నావ్ బంగారం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.



Similar News