ధనరాజ్‌ను నిండా ముంచేసిన యాంకర్ శ్రీముఖి .. ఇప్పుడు పీకల్లోతు అప్పుల్లో..?

యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె యాంకరింగ్‌లో ఓ వెలుగు వెలిగి పోయింది.

Update: 2024-07-07 04:21 GMT

దిశ, సినిమా: యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె యాంకరింగ్‌లో ఓ వెలుగు వెలిగి పోయింది. పటాస్ ప్రోగ్రామ్‌తో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ తర్వాత పలు షోల్లో చేయడమే కాకుండా ఈవెంట్స్‌లో కూడా తన యాంకరింగ్‌తో అందరిని ఆకట్టుకుంది. కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా నటించి మెప్పించింది. అంతే కాకుండా బిగ్‌బాస్ లోకి వెళ్లి వచ్చిన తర్వాత ఈ భామ గ్రాస్ మరింత పెరిగిపోయిందనే చెప్పాలి. ఓ వైపు టీవీ షోలు మరోవైపు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉంటుంది. ఇదిలా ఉంటే ఈమెకు సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈమె వల్ల ఓ స్టార్ కమెడియన్ పీకల్లోతు అప్పులు పాలు అయ్యాడంటూ వార్తలు షికారు చేస్తున్నాయి. అసలు విషయంలోకి వెళితే..

జబర్థస్త్‌లో టీమ్ లీడర్‌గా మంచి మంచి స్కిట్లతో అదరగొట్టిన ధనరాజ్ అందరికీ సుపరిచితమే. ఇలా షోలో స్కిట్లతో అదరగొట్టిన ధనరాజ్ మంచి మంచి సినిమా అవకాశాలు కూడా అందిపుచ్చుకున్నాడు. ఇక నటుడిగానే స్థిర పడిపోకుండా నిర్మాతగా, దర్శకుడిగా పలు అవతారాలు ఎత్తాడు. ఈ క్రమంలోనే ధనరాజ్ యాంకర్ శ్రీముఖి హీరోయిన్‌గా ‘ధనలక్ష్మి తలుపు తడితే’ అనే సినిమాను నిర్మించాడు. ఆ సినిమా కోసం తన దగ్గర ఉన్నదంతా తీసి పెట్టాడు.

అప్పటికీ బడ్జెట్ సరిపోకపోతే తన స్నేహితుల దగ్గర అప్పు చేశాడట. అయితే సినిమా రిలీజ్ కావడం, మంచి టాక్ రావడం, వారం రోజుల వరకు బాగానే ఆడడం జరిగిందట. తర్వాత ఈ మూవీని పట్టించుకునే వాళ్లు కరువయ్యారు. దీంతో శ్రీముఖి ఉండటం వల్లే ఈ సినిమా అంతగా ఆడలేదు. ఆమె బదులు టాప్ హీరోయిన్ ఉండి ఉంటే ఈ సినిమా కచ్చితంగా ఆడేది. శ్రీముఖిని పెట్టి సినిమా చేయడం వల్లే ధన్‌రాజ్ పీకల్లోతు కష్టాల్లో పడి అప్పులు పాలు అయ్యాడు అంటూ ఓ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తుంది.


Similar News