రాయలసీమ యాసలో రష్మిక మూవీ.. హీరో ఎవరంటే?

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం ‘పుష్ప 2’తో బిజీగా ఉంది.

Update: 2024-07-02 09:11 GMT

దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం ‘పుష్ప 2’తో బిజీగా ఉంది. ‘పుష్ప’తో పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ప్రజెంట్ వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది. అయితే.. ‘పుష్ప’ సినిమాలో ప్రత్యేకంగా రష్మిక యాసకు, కట్టు, బొట్టుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరోసారి సీమ సింగారంతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది రష్మిక.

విజయ్ దేవరకొండ హీరోగా త్వరలో ఓ పీరియాడిక్ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ కోసం రాయలసీమలో ఆడిషన్స్ కూడా స్టార్ట్ చేసింది చిత్ర బృందం. ఆ ప్రాంత యాస వచ్చిన వాళ్లకు అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. అయితే.. ఇప్పుడు ఇందులో విజయ్‌కు జోడీగా రష్మిక పేరు గట్టిగా వినిపిస్తుంది. ఇప్పటికే చర్చలు జరపగా మాక్సిమమ్ ఓకే అయినట్లు తెలుస్తుంది. ప్రజెంట్ ఈ న్యూస్ నెట్టింట వైరల్ కావడంతో.. రష్మిక మరోసారి సీమ పాత్రలో కనిపించనుందని తెలుసుకున్న ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.  

Similar News