పైరసీ వల్ల కోట్లలో నష్టపోతున్నాం.. అధికారులపై ఫైర్ అయిన రిషబ్ శెట్టి ట్వీట్ వైరల్

రిషబ్ శెట్టి డైరెక్టర్‌గా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే పలు చిత్రాలకు దర్శకత్వం వహించి తెరకెక్కించారు.

Update: 2023-11-05 06:11 GMT
పైరసీ వల్ల కోట్లలో నష్టపోతున్నాం.. అధికారులపై ఫైర్ అయిన రిషబ్ శెట్టి ట్వీట్ వైరల్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: రిషబ్ శెట్టి డైరెక్టర్‌గా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే పలు చిత్రాలకు దర్శకత్వం వహించి తెరకెక్కించారు. ముఖ్యంగా తెలుగులో ‘కాంతార’ మూవీతో బాక్సాఫీసును బద్దలు కొట్టాడు. 2022లో విడుదలైన ఈ సినిమా అన్ని బాషల్లో రిలీజ్ అయి కాసుల వర్షం కురిపించింది. రిషబ్ యాక్టింగ్ కు, డైరెక్షన్ కు అంతా ఫిదా అయ్యారు. త్వరలో కాంతార-2 కూడా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, రిషబ్ పైరసీపై ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ‘‘ పైరసీ కారణంగా ఏటా 20,000 కోట్లు నష్టాలను ఎదురు కొంటున్నందున.. దానిని అరికట్టడానికి ప్రధాన చర్యలు తీసుకోవాలి. అలాగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) (MIB) అధికారులు.. పైరసీని ఆపేయాలి. సినిమా కంటెంట్‌ను మోసుకెళ్లే ఏదైనా వెబ్‌సైట్, యాప్, లింక్‌ను డైరెక్ట్‌గా బ్లాక్ చేయండి తీసే అధికారం మీరు కలిగి ఉన్నారు. కనుక పైరసీపై చర్యలు తీసుకోవాలి’’ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం రిషబ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Tags:    

Similar News