నేడు సింగర్ మాళవిక పుట్టిన రోజు

సింగర్ మాళవిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గంగోత్రి సినిమాలో.. నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం అనే పాటతో తన కెరీర్ ప్రారంభించిన మాళవిక చాలా తక్కువ సమయంలో గాయనిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Update: 2024-07-06 01:59 GMT

దిశ, సినిమా : సింగర్ మాళవిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గంగోత్రి సినిమాలో.. నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం అనే పాటతో తన కెరీర్ ప్రారంభించిన మాళవిక చాలా తక్కువ సమయంలో గాయనిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఈమె తన గానంతో ఎంతో మందిని ఆకట్టుకుంది. ఇక మాళవిక తల్లి సంగీత ఉపాధ్యాయురాలు. అలా  తన తల్లి వద్దే సంగీత శిక్షణ తీసుకుంది ఈ బ్యూటీ. ఇంటిలో సంగీత వాతావరణం ఉండే సరికి, ఈమెకు కూడా చిన్నప్పటి నుంచే సంగీతం అంటే ఎక్కువ ఇష్టం ఉండేది. అలా,అనేక పాటల పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకుంది. తర్వాత పాడుతా తీయగాలో అవకాశం రావడంతో, ఈమె లైఫ్ టర్న్ అయ్యిందనే చెప్పవచ్చు. తర్వాత సినిమాల్లో కూడా అవకాశాలు అందుకొని, తన టాలెంట్‌తో స్టార్ సింగర్ రేంజ్‌కు ఎదిగిపోయింది. అలా తన గానంతో ఎంతో మందిని మైమరిపించే సింగర్ మాళవిక పుట్టిన రోజు నేడు. దీంతో ఈరోజు తన అభిమానులు సోషల్ మీడియాలో పెద్దఎత్తున బర్త్ డే విషెస్ చెబుతున్నారు.


Similar News