అవేవి నిజాలు కాదు.. మీ ఊహకు కూడా అందవు.. కమల్ హాసన్ కామెంట్స్ వైరల్

లోకనాయకుడు కమల్ హాసన్ తాజా సినిమా ‘భారతీయుడు 2’.

Update: 2024-06-29 10:11 GMT

దిశ, సినిమా: లోకనాయకుడు కమల్ హాసన్ తాజా సినిమా ‘భారతీయుడు 2’. 27 ఏళ్ల క్రితం వచ్చిన ‘భారతీయుడు’కి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీకి శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్, ఎప్‌జే సూర్య లాంటి స్టార్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇక ఇప్పటి వరకు ఇందులో నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ ఆకట్టుకోగా.. ట్రైలర్‌కు స్పెషల్ క్రేజ్ వచ్చింది. ఇక ట్రైలర్ రిలీజ్ అప్పటి నుంచి.. ఈ చిత్రం స్టోరీ ఇదే అంటూ అనేక కథనాలు వినిపిస్తున్నాయి. అవినీతికి పాల్పడే ప్రభుత్వ అధికారులందరినీ సిద్ధార్థ్ చంపేస్తాడని కొందరూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.

అయితే.. దీనిపై తాజాగా కమల్ హాసన్ స్పందిస్తూ.. ఓ ట్వీట్ రిలీజ్ చేశారు. ‘ఈ సినిమా గురించి రకరకాల కథలు వినిపిస్తున్నాయి. సేనాపతి గెటప్ గురించి కూడా కొన్ని కథలు రాస్తున్నారు. అయితే.. మీరు ఊహించుకున్నవి ఏవి నిజం కాదు. ఈ సినిమా కథను ఎవరూ ఊహించలేకపోయారు. అందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను’ అంటూ చెప్పుకొస్తూ.. ‘‘ఇండియన్ 3’లో సేనాపతి తండ్రి పాత్ర కూడా తెరపై కనిపిస్తుంది’ అని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం కమల్ హాసన్ కామెంట్స్ నెట్టింట వైరల్ కావడంతో.. ఇండియన్ 3పై కూడా హిట్ ఇచ్చారుగా అని రిప్లైలు ఇస్తున్నారు నెటిజన్లు

Similar News