‘డబుల్ ఇస్మార్ట్’ స్టెప్పామార్ సాంగ్ రిలీజ్.. మాస్ స్టెప్స్‌తో యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న రామ్ పోతినేని (వీడియో)

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ‘డబుల్ ఇస్మార్ట్’ పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

Update: 2024-07-01 11:15 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ‘డబుల్ ఇస్మార్ట్’ పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ఇస్మార్ట్ శంకర్ సిక్వెల్‌గా రాబోతుంది. దీనికి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అంతేకాకుండా పూరి, ఛార్మి కౌర్ కలిసి నిర్మిస్తుండగా.. ఇందులో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే ఇందులో సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

ఆగస్ట్ 15న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. దీంతో మేకర్స్ ఒక్కొక్క అప్డేట్‌ను విడుదల చేస్తూ సినీ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, డబుల్ ఇస్మార్ట్ సినిమా నుంచి స్టెప్పా‌మార్ ఫస్ట్ సాంగ్‌‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో రామ్ కిరికిరి దిమ్మాక్ కిరి కిరి అని పాడుతూ మాస్ స్టెప్స్‌తో అదరగొట్టాడు. ఇస్మార్ట్ శంకర్ చాలా డేంజర్ అంటూ మాస్ డైలాగ్స్‌తో ఉన్న లిరిక్స్ పాడుతూ డాన్స్‌తో దుమ్ములేపాడు. ప్రస్తుతం స్టెప్పామార్ సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఈ సాంగ్ వీడియో చూసిన వారంతా ఫైర్ ఎమోజీలను షేర్ చేస్తూ ‘బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్నాం అని ఫస్ట్ పాటతోనే అర్థం అయింది’ అని కామెంట్లు పెడుతున్నారు.


Full View


Similar News