అమితాబ్ బచ్చన్ మనవడితో షారుఖ్ కూతురు డేటింగ్.. అడ్డంగా బుక్ అయిన స్టార్ కిడ్స్ (వీడియో)

ఇండస్ట్రీలో చాలామంది సినీ సెలబ్రిటీలు ముందు డేటింగ్ చేసిన తర్వాతే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.

Update: 2024-06-29 08:27 GMT

దిశ, సినిమా: ఇండస్ట్రీలో చాలామంది సినీ సెలబ్రిటీలు ముందు డేటింగ్ చేసిన తర్వాతే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అయితే కొందరు మధ్యలో బ్రేకప్ చెప్పుకుని విడిపోతున్నారు. అయితే డేటింగ్ అనేది ప్రస్తుత కాలంలో కామన్ అయిపోయింది. తాజాగా, ఓ ఇద్దరు స్టార్ కిడ్స్ డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు జోరందుకున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్, అమితాబ్ బచ్చన్ మనవడు ఆగస్య డేటింగ్‌లో ఉన్నట్లు పుకార్లు షికారు చేస్తున్నారు.

లండన్ నగరంలోని ఓ నైట్ క్లబ్‌లో వీరిద్దరు పార్టీలో ఎంజాయ్ చేస్తుండగా.. కెమెరాకు అడ్డంగా చిక్కారు. ప్రస్తుతం వారికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. దీంతో డేటింగ్‌లో ఉన్నారంటూ ప్రచారం మొదలైపోయింది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలిసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. అలాగే పెళ్లి చేసుకుంటారా డేటింగ్ మాత్రమేనా? అని పలు కామెంట్లు చేస్తున్నారు. కాగా, షారుఖ్ కూతురు ఈ మధ్యనే ది ఆర్చిస్ మూవీతో బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ప్రస్తుతం ఓ సినిమా కూడా చేస్తుందట.

Similar News