సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘జటాధర’ నుంచి సెకండ్ పోస్టర్.. ఎంతో ఆతృతగా ఉందంటున్న హీరో
వైవిధ్యమైన కథలు, పాత్రలు ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు నవ దళపతి సుధీర్ బాబు.
దిశ, సినిమా: వైవిధ్యమైన కథలు, పాత్రలు ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు నవ దళపతి సుధీర్ బాబు. ప్రజెంట్ ఈయన నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘జటాధర’ ఒకటి. సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కతున్న ఈ సినిమా.. ప్రేరణ అరోరా సమర్పణలో సుధీర్ బాబు ప్రొడక్షన్ బ్యానర్‌పై ఇండియన్ సినిమాల్లో ఓ బెంచ్ మార్క్‌ను క్రియేట్ చేసేలా రూపొందుతోంది. పాన్ ఇండియా సినీ ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ అంచనాలు క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం 2025 శివరాత్రి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇందులో భాగంగా ‘జటాధర’ నుంచి వరుస అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుష్ చేస్తున్నారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి మరో పోస్టర్ విడుదల చేశారు. పౌరాణిక, ఫాంటసీ, డ్రామా అంశాల కలయికగా ఈ చిత్రం తెరకెక్కుతోందని విడుదలైన పోస్టర్ చూస్తుంటేనే అర్థమవుతుంది. అలాగే ఇందులో సుధీర్ సరికొత్త లుక్‌లో కనిపించగా.. బ్యాక్ గ్రౌండ్ మాత్రం సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరింతగా పెంచుతోంది.
ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ ‘‘జటాధర’ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన రావడంతో సంతోషమేసింది. ఆ సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. ఈ సినిమాలోకి అడుగు పెట్టటం అనేది ఓ సరికొత్త ప్రపంచాన్ని నాకు పరిచయం చేసింది. నాకు ఇది ఎప్పటికీ మరచిపోలేని అనుభవం. శాస్త్రీయత, పౌరాణిక అంశాల కలయిక స్క్రిప్ట్‌ను రాశారు. ఈ రెండు జోనర్స్‌కు చెందిన ప్రపంచాలను రేపు ఆడియెన్స్ వెండితెరపై చూస్తున్నప్పుడు ఓ సరికొత్త సినిమా అనుభూతిని పొందుతారు. ఇక ఈ మూవీకి సంబంధించిన సెకండ్ పోస్టర్ పౌరాణిక ప్రపంచాన్ని తెలియజేస్తుంది. ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఉండే అంశాలు ఎన్నో ఈ సినిమాలో ఉండబోతున్నాయి. వాటి గురించి తెలియజేయటానికి, ప్రేక్షకులు ఈ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఎలా ఎంజాయ్ చేస్తారో చూడాలని నేను ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను’ అన్నారు.