తండ్రి ఆరాటం.. కొడుకు పోరాటం.. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ‘లైఫ్’

శ్రీహర్ష, కషిక కపూర్ జంటగా వస్తున్న తాజా సినిమా ‘లైఫ్ (లవ్ యువర్ ఫాదర్)’.

Update: 2024-09-24 14:32 GMT

దిశ, సినిమా: శ్రీహర్ష, కషిక కపూర్ జంటగా వస్తున్న తాజా సినిమా ‘లైఫ్ (లవ్ యువర్ ఫాదర్)’. పవన్ కేతరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, అన్నపరెడ్డి స్టూడియోస్‌పై కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ, ఏ. రామస్వామి రెడ్డి నిర్మిస్తున్నారు. ఎస్.పి. చరణ్, నవాబ్ షా, ప్రవీణ్, భద్రం, రఘుబాబు, షకలక శంకర్, రియా, సంధ్య ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమా షూటింగ్ నేటితో పూర్తవడంతో మీడియాతో ముచ్చటించారు చిత్ర బృందం.

ఈ సందర్భంగా దర్శకుడు పవన్ కేతరాజు మాట్లాడుతూ ‘కొడుకు బాధ్యత తీర్చేందుకు తండ్రి పడే ఆరాటం.. తండ్రి కోసం కొడుకు చేసే పోరాటం మా ఈ ‘లైఫ్’ సినిమా. కథ అంతా కాశి బ్యాక్ డ్రాప్‌లో జరుగుతూ శివతత్వాన్ని చూపించే చిన్న ప్రయత్నం చేశామన్నారు. ఒక మంచి ఫ్యామిలీ ఎంటరటైనర్ సినిమాగా ఈ సినిమాని తీస్తున్నాం. హీరో శ్రీహర్ష మొదటి సినిమా అయినా చాలా బాగా నటించాడు. హీరో తండ్రి పాత్రలో ఎస్పి చరణ్ ఈ సినిమాకి చాలా ప్లస్ అయ్యారు. రఘు బాబు, షకలక శంకర్, ప్రవీణ్ కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. మణిశర్మ ఇచ్చిన మ్యూజిక్ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. అన్ని పాటలు చాలా మేలోడి‌గా ఇచ్చారు. క్లైమాక్స్ అండ్ బిజియం కథకి హైలైట్. కషిక కపూర్ చాలా బాగా నటించింది. ఖచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాను’ అని చెప్పుకొచ్చారు.




Similar News