సాయి పల్లవి సీక్రెట్ లవ్ స్టోరీ.. అతనితో ఏకంగా 10 ఏళ్లుగా రిలేషన్‌లో ఉన్నానంటూ షాకింగ్ కామెంట్స్

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది.

Update: 2024-07-06 02:22 GMT

దిశ, సినిమా: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ‘ప్రేమమ్’ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఈ సినిమాతో మంచి ఫేమ్ తెచ్చుకుంది. ముఖ్యంగా సినిమాల్లో కొన్ని కండిషన్స్ పెట్టుకొని నటించడం, ఎక్కువ రొమాంటిక్ సీన్స్‌కు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఈమెపై మరింత అభిమానం పెరిగిపోయింది. ప్రస్తుతం ‘రామాయణం’లో సీత పాత్రలో నటిస్తుంది ఈ అమ్మడు. ఈ క్రమంలో తాజాగా ఈమె డ్రీమ్ బాయ్ గురించిన ఓ వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. అదేంటంటే..?

గతంలో సాయి పల్లవి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన డ్రీమ్ బాయ్ గురించి మాట్లాడింది. అదే విషయం తాజాగా వైరల్ అవుతుంది. ఈమె ఏకంగా 10 ఏళ్లుగా ఆ వ్యక్తిని గాఢంగా ప్రేమిస్తున్నానంటూ చెప్పి షాక్ ఇచ్చింది. అంతే కాకుండా నా డ్రీమ్ బాయ్ అంటూ అతని పేరు చెప్తూ మురిసిపోయింది ఈ బ్యూటీ. దీంతో ఒక్కసారిగా ఆమె అభిమానులు తన లవ్ స్టోరీని సాయి పల్లవి ఇంత సీక్రెట్‌గా ఎలా ఉంచింది? అని ఉలిక్కిపడుతున్నారు. కానీ అసలు విషయం తెలుసుకుని సాయి పల్లవి చమత్కారానికి ఫిదా అవుతున్నారు. అయితే సాయి పల్లవికి ఇష్టమైన వ్యక్తి ఎవరో కాదు మహాభారతంలోని అర్జునుడి కొడుకు. తనకు అభిమన్యుడు అంటే చాలా ఇష్టమని సాయి పల్లవి చెప్పడం విశేషం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తుంది.


Similar News