‘శారీ’ సినిమా తీస్తానని.. ఇదేం అరాచకం.. ఆరాధ్య దేవి అందాలతో కాకపుట్టిస్తున్న RGV

ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న బ్యూటీ శ్రీలక్ష్మీ.

Update: 2024-06-18 14:17 GMT

దిశ, సినిమా: ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న బ్యూటీ శ్రీలక్ష్మీ. ఆర్‌జీవి ఒక్క పోస్ట్‌తో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక శ్రీలక్ష్మీ ఒప్పుకుంటే ఆర్‌జీవి ‘శారీ’ అనే సినిమా కూడా తీస్తా అన్నాడు. ఇక ఆమె ఒప్పుకోవడం సినిమా స్టార్ అవ్వడం కూడా జరిగింది. ఇక సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ.. శారీలో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ బ్యూటీని ఇప్పుడు ఆర్జీవీ హీరోయిన్‌ను చేశాడు. అయితే.. మొన్నటివరకు చీరకట్టులో పద్దతిగా కనిపించిన ఈమె.. మన ఆర్‌జీవి చేతిలో పడగానే టోటల్ చేంజ్ అయింది. ఆమె లోని మరో యాంగిల్‌ను ప్రేక్షకులకు పరిచడం చేశాడు వివాదాస్పద దర్శకుడు వర్మ.

ఈ మేరకు ఓ జలపాతం కింద హీరోయిన్ తడుస్తూ డాన్స్ చేస్తున్న వీడియోను రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌లో ఆమెను ఆరాధ్య దేవిగా పరిచయం చేసిన ఆర్‌జీవి.. ఆ అమ్మడు అందాలు చూపించాడు. నీళ్లలో తడుస్తూ నెమలిలా నాట్యం చేస్తూ అదరగొట్టింది ఆరాధ్య దేవి. అంతే కాకుండా.. 5 నిమిషాలు ఉన్న ఈ వీడియోలో ఎక్కడా కూడా సాంగ్ లేదు. మొత్తం స్లో మోషన్‌లో శ్రీలక్ష్మీ అందాలు చూపిస్తూ తీశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. బోల్డ్ కామెంట్స్‌తో రచ్చ చేస్తున్నారు నెటిజన్లు.

Full View


Similar News