జబర్దస్త్ నూకరాజు ఆమెపై మోజుపడి ఆసియాను చీట్ చేశాడా.. బయటపడ్డ షాకింగ్ విషయాలు?

జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది క్రేజ్ సంపాదించుకుని ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా మారిపోయారు. అంతేకాకుండా సినిమాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటిస్తున్నారు.

Update: 2024-06-26 15:39 GMT

దిశ, సినిమా: జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది క్రేజ్ సంపాదించుకుని ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా మారిపోయారు. అంతేకాకుండా సినిమాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటిస్తున్నారు. అయితే కొందరు స్టార్ హీరోలతో సినిమాలు చేసే అంత రేంజ్‌కు కూడా ఎదిగిపోయారు. అలాగే జబర్దస్త్ కమెడియన్ నూకరాజు కూడా పటాస్ షో ద్వారా పరిచయం అయినప్పటికీ జబర్దస్త్ తర్వాత విపరీతమైన పాపులారిటీ వచ్చింది. అయితే ఈ షోలో కమెడియన్‌గా ఉన్న ఆసియాతో నూకరాజు ప్రేమాయణం నడిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరు యూట్యూబ్‌లో వ్లాగ్స్ చేస్తూ ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు. అలాగే కొన్నిసార్లు నూకరాజు, ఆసియాకు బ్రేకప్ చేస్తున్నట్లు వీడియో చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. కానీ అవన్నీ యూట్యూబ్ వీడియో కోసమే చేసినట్లు తర్వాత క్లారిటీ వచ్చింది.

ఈ క్రమంలో.. తాజాగా, నూకరాజు ఆసియాను చీట్ చేస్తున్నాడనే వార్త వెలుగులోకి వచ్చి అందరినీ షాక్‌ అయ్యేలా చేస్తోంది. ఓ షోలో భాగంగా నూకరాజు, లేడీ కమెడియన్ ఫైమా పలు కామెంట్స్ చేయడంతో అందరిలో పలు అనుమానాలు మొదలయ్యాయి. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో గేమ్‌లో భాగంగా ఫైమా నీ క్రష్ ఎవరు అడగ్గా.. జబర్దస్త్ ప్రవీణ్, ఇంకో ప్రవీణ్ తో పాటు నూకరాజు ఫోటో కూడా ఉంది. కానీ ఫైమా మాత్రం.. నూకరాజు గురించి చెప్తూ.. లైఫ్ లో కనెక్ట్ అయిన వాళ్లు.. మన కోసం ఆలోచించే వాళ్ళు.. అలా ఉన్నవాళ్లలో నూకరాజు కూడా ఉన్నాడు’’ అని చెప్పుకొచ్చింది. ఇక నూకరాజు కూడా నన్ను పట్టించుకునే వాళ్లలో ఫైమా కూడా ఉంది అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో అది చూసిన వారంతా నూకరాజు ఫైమాపై మోజు పడి ఆసియాను చీట్ చేస్తున్నాడా? అని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని.. కేవలం అది గేమ్ కోసమే చెప్పారని వారిద్దరు మంచి ఫ్రెండ్స్ అని ఫ్యాన్స్ కొట్టిపారేస్తున్నారు.

Similar News