Kalki: కల్కి సినిమాలో ఏపీ టెంపుల్.. యుగాల చిరిత్ర కలిగిన ఆలయం..

ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమా విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.

Update: 2024-06-29 14:30 GMT

దిశ వెబ్ డెస్క్: ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమా విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ అమితాబ్‌ బచ్చన్, కోలివుడ్ స్టార్ హీరో కమల్ హాసన్‌తోపాటు తదితర తారాగణం నటించి మెప్పించిన ఈ చింత్రంలో చూపించిన ఓ గుడి రెండు తెలుగురాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. అదే అశ్వత్థామ తలదాచుకున్న గుడి. ఈ గుడి ఎక్కడో కాదు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని చేజర్ల మండలం.. పెరుమాళ్లపాడు అనే గ్రామంలో ఉంది.

కథలు కథలుగా చెప్పిన గుడి చరిత్ర..

గ్రామంలోని పెద్దులు చెప్పే కథలు ఇలా ఉన్నాయి. కొన్ని యుగాల క్రితం తన తండ్రి ఎవరో ఎక్కడున్నారో చెప్పమని పరశురాముడు తన తల్లి అయినటువంటి రుణుక ఎల్లమ్మను కొట్టి చిత్రహింసలు పెట్టారని, అయితే పరుశురామునికి 24 సంవత్సరాలు నిండే వరకు తన జాడ చెప్పొదని ఎల్లమ్మ భర్త జమదగ్ని ముని ఆజ్ఞాపించారని అందుకే కొడుకు ఎన్ని బాధలు పెట్టిన భరించిందని తెలిపారు.

కాగా పరుశురామునికి 24 సంవత్సరాలు నిండిన తరువాత రేణుక ఎల్లమ్మ పరుశురామునికి తండ్రి జాడ చెప్పిందని, అయితే అసలు విషయం తెలియక తన తల్లి ఎల్లమ్మను కొట్టానని, ఆ పాపానికి ప్రాయశ్చితం లేదని బాధ పడుతున్న పరుశురామునికి ఎల్లమ్మ ధైర్యం చెప్పి పెన్నా నది తీరానా 101 దేవాళయాలను కట్టించమని, అలా చేస్తే తెలియక చేసిన పాపం కనుక ఆ దోషం పోతుందని తెలిపింది. దీనితో తల్లి మాట ప్రకారం పరుశురాముడు పెన్నా నది తీరాన గుళ్లు కట్టిస్తూ వచ్చారు.

ఇలా రామతీర్థం, సోమశిల, పెరుమళ్లపాడు, కోటీతీర్థం ఇలా పెన్నా నది తీరం వెంబడి పలు గుళ్లు కట్టించారు. వీటీలో రామతీర్థం, సోమశిల, కోటీతీర్థం మొదలైన ప్రాంతాల్లోని దేవాలయాలు నేటికీ నిత్య పూజలతో విరాజిల్లుతున్నాయి. అయితే చేజర్ల మండలం పరిధిలోనే పరుశురాముడు కట్టించిన రెండు దేవాళయాలు ఉన్నాయి. వాటిలో ఓకటి కోటీతీర్థంలో పెన్నా నది పక్కన కట్టించిన శ్రీ కోటేశ్వర స్వామి ఆలయం.

ఇక్కడ నిత్యం పూజలు జరుగుతుంటాయి. మహా శివరాత్రి ఉత్సవాలు 5 రోజులు నిర్వహిస్తారు. కార్తీకమాసం వంటి పర్వదినాల్లో జిల్లాలోని నలుమూలల నుండి ఇక్కడికి భక్తులు విరివిగా తరలి వస్తారు. ఈ ఆలయంలో బల్లి సైతం ఉంది. కోటితీర్థంలో మరణిస్తే కాశిలో మరణించినంత పుణ్యం వస్తుందని అక్కడి ప్రజల నమ్మకం. ఇక మరో గుడి పెరుమళ్లపాడులోని నాగేశ్వరస్వామి ఆలయం.

ఒకప్పుడు నిత్యపూజలతో విరాజిల్లిన ఈ ఆలయం కాలగమనంలో దాదాపు 300 సంవత్సరాల క్రితం పెన్నా నదికి వచ్చిన వరదల్లో భూగర్భంలో కలిసిపోయింది. అప్పటి నుండి 2020 వరకు ఈ ఆలయం గోపురంలోని కొంత భాగం పైకి కనిపిస్తూ ఉండేది. కాగా పైన చెప్పిన ఆలయాలన్నీ కొన్ని యుగాల క్రితం నిర్మి్ంచినవ అని, వాటిని పరుశురాముడు కట్టించారని చెప్పడాని ఆధారాలు సైతం ఉన్నట్టు గుడి అర్చకులు తెలుపుతున్నారు.

వెలుగులోకి పెరుమళ్లపాడులోని నాగేశ్వరస్వామి ఆలయం..

చిన్నప్పటి నుండి పెన్నా నదిలో ఈతకొడుతూ, ఆ నది లోని ఇసుక తిన్నెల్లో ఆటలాడే సమయంలో ఆ గుడి గోపురాన్ని చూస్తూ, ఆ గుడి గురించిన చరిత్రను వింటూ పెరిగిన పెరుమళ్లపాడు యువకులు 2020లో జేసీబీని ఉపయోగించి ఇసుకలో కూరుకుపోయిన గుడిని బయటకు తీయించారు. దీనితో అప్పట్లో ఈ గుడి గురించి వార్తలు సైతం వెలుగు చూశాయి. అయితే ఈ గుడిని కల్కీ సినిమాలో చూపించడంతో ఈ గుడిపై సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్‌గా మారి ప్రపంచానికి తెలుస్తోంది.

Similar News