రాజకీయాలకు గుడ్‌ బై.. MLA అభ్యర్థి సంచలన ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. మాజీ ఐఏఎస్ ఇంతియాజ్ అహ్మద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు.

Update: 2024-12-27 12:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. మాజీ ఐఏఎస్ ఇంతియాజ్ అహ్మద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని శుక్రవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటానని ఆసక్తికర ప్రకటన చేశారు. బంధువులు, స్నేహితుల సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇకనుంచి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నట్లు స్పష్టం చేశారు. కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇంతియాజ్ కర్నూలు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు.


ఇదిలా ఉండగా.. వైసీపీకి ముఖ్య నేతలు వరుసగా ఝలక్‌ ఇస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. మాజీ మంత్రి, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త ముత్తంశెట్టి శ్రీనివాసరావు వారం కిందట పార్టీకి రాజీనామా చేయగా, శుక్రవారం పశ్చిమ నియోజకవర్గ మాజీ సమన్వయకర్త, విశాఖ డెయిరీ చైర్మన్‌ ఆడారి ఆనంద్‌కుమార్‌ పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్ రాజీనామా ఆ పార్టీ నేతలను కలవరపరుస్తోంది. వీరి బాటలో ఇంకెంత మంది ప్రయాణిస్తారో చూడాలి.

Tags:    

Similar News