తండ్రి పాత్రలకు కూడా సిద్ధమే.. దయచేసి ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. డైరెక్టర్ రిక్వెస్ట్

ఒకప్పుడు కరణ్ జోహార్ అంటే బాలీవుడ్.. బాలీవుడ్ అంటే కరణ్ జోహార్ అన్నట్లు ఉండేది పరిస్థితి. కానీ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత సిచుయేషన్స్ మారాయి. బాలీవుడ్ మాఫీయా బాయ్ కాట్ స్టార్ట్ అ

Update: 2024-06-26 15:12 GMT

దిశ, సినిమా: ఒకప్పుడు కరణ్ జోహార్ అంటే బాలీవుడ్.. బాలీవుడ్ అంటే కరణ్ జోహార్ అన్నట్లు ఉండేది పరిస్థితి. కానీ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత సిచుయేషన్స్ మారాయి. బాలీవుడ్ మాఫీయా బాయ్ కాట్ స్టార్ట్ అయింది. దీంతో వరుస సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. సౌత్ ఇండస్ట్రీ హవా మొదలైంది. కొత్త ఆర్టిస్టుల రాక, ఓటిటి ప్లాట్ ఫామ్ బూమింగ్ తో బాలీవుడ్ అవసరమే లేకుండా పోయింది. దీంతో కరణ్ కూడా అడ్రస్ లేకుండా పోయాడు. ఓ కామెడీ ప్రోగ్రాం కూడా ఆయన మీద జోకులు వేసే పరిస్థితి వచ్చేసింది.

అయితే ఏదేమైనా ఒక ఆర్టిస్టుగా తెరపై కనిపించాలనే తనలోని తపన మాత్రం వాస్తవం. కాగా ప్రస్తుతం ఒక్క అవకాశం ఇవ్వమని డైరెక్టర్లను కోరుతున్నాడు. తండ్రి పాత్రలు చేసేందుకు కూడా రెడీ అంటున్నాడు. ' బాంబే వెల్వెట్ ' మూవీ తర్వాత తను ఏ సినిమాలో నటించలేదని.. హీరోయిన్ అనన్యా పాండే ఫాదర్ గా కనిపించేందుకు ఇష్టపడుతున్నట్లు తెలిపాడు. మరి ఈ రిక్వెస్ట్ ను దర్శకులు పరిగణించి అవకాశం ఇస్తారో లేదో చూడాలి.

Similar News