కొత్త టెక్నిక్ నేర్చుకున్న సమంత... ఆ మూడు రోజులకు సంబంధించిన ఫొటోలు షేరింగ్

బ్యూటిఫుల్ సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. హెల్త్ పై కాన్సంట్రేషన్ చేసింది. ఈ క్రమంలోనే మయోసైటిస్ కోసం ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆమె... మెంటల్ హెల్త్ కోసం యోగా, ధ్యానం చేస్తూ కనిపిస్తుంది. వెకేషన్ కు వెళ్తూ

Update: 2024-06-26 14:57 GMT

దిశ, సినిమా: బ్యూటిఫుల్ సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. హెల్త్ పై కాన్సంట్రేషన్ చేసింది. ఈ క్రమంలోనే మయోసైటిస్ కోసం ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆమె... మెంటల్ హెల్త్ కోసం యోగా, ధ్యానం చేస్తూ కనిపిస్తుంది. వెకేషన్ కు వెళ్తూ మానసికంగా సంతోషంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఆమె నటించిన ' సిటాడెల్ ' రిలీజ్ కావాల్సి ఉండగా... కొత్తగా మరో ప్రాజెక్ట్ ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసమే మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్స్ నేర్చుకుంటున్నట్లు సమాచారం. కాగా మూడు రోజుల ట్రైనింగ్ కు సంబంధించిన ఫొటోలు షేర్ చేసింది. మొదటి పిక్ లో ట్రైనర్ తో ఉన్నట్లు.. తర్వాత సెకండ్ సెషన్ లో యాక్టివ్ గా ఉన్నట్లు.. థర్డ్ పిక్చర్ లో అలిసిపోయి డెడ్ అయిన ఫీలింగ్ వచ్చినట్లు పెట్టింది.

ఇక ఈ పోస్ట్ చూసిన అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. రెస్ట్ పీరియడ్ నుంచి బయటకు వచ్చేసినట్లే అని సంతోషపడుతున్నారు. వరుస సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు. మరి సమంత మార్షల్ ఆర్ట్స్ సినిమా కోసమే నేర్చుకుంటుందా లేక సెల్ఫ్ ఇంట్రెస్టా అనేది తెలియాల్సి ఉంది.

Similar News