Kalki 2898 AD : ప్రభాస్ తల్లిదండ్రులుగా మృణాల్, దుల్కర్

ప్రభాస్ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ 'Kalki 2898 AD' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్, థీమ్ సాంగ్స్ సినిమా నెక్స్ట్ లెవల్ లో ఉంటుందనే ఎగ్జయిట్మెంట్ పెంచడంలో సక్సెస్ అయ్యాయి. అయితే నాగ్

Update: 2024-06-26 14:54 GMT

దిశ, సినిమా: ప్రభాస్ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ 'Kalki 2898 AD' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్, థీమ్ సాంగ్స్ సినిమా నెక్స్ట్ లెవల్ లో ఉంటుందనే ఎగ్జయిట్మెంట్ పెంచడంలో సక్సెస్ అయ్యాయి. అయితే నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీలో ప్రభాస్.. కల్కి అవునా కాదా? దీపికా పదుకునేకు పుట్టబోయే బిడ్డ రెబల్ స్టార్ అవుతాడా? లాంటి ప్రశ్నలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో చర్చ తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో డార్లింగ్ తల్లిదండ్రులుగా 'సీతారామం ' జంట మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్ కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇదే నిజమైతే మరోసారి ఈ జోడీ అభిమానులకు కనువిందు చేయబోతున్నట్లే అంటున్నారు నెటిజన్లు.

కాగా ' సీతారామం ' చిత్రం 'Kalki 2898 AD' మూవీని ప్రొడ్యూస్ చేస్తున్న వైజయంతీ మూవీస్ బ్యానర్ నిర్మించడం విశేషం. కాగా కల్కిలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, శోభన, రాజేంద్ర ప్రసాద్, అన్నా బెన్ లాంటి నటీనటులు కనిపించనున్నారు. వీరితోపాటు పలువురు స్టార్స్ గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వనున్నారని సమాచారం.


Similar News