రజనీకాంత్ ఎనర్జీ సీక్రెట్ ఇదే.. హిమాలయాల్లో దొరికే అవి తినడం వల్లే..
ఈ వయసులోనూ ‘జైలర్’తో రికార్డులు తిరగరాస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్..
దిశ, సినిమా : ఈ వయసులోనూ ‘జైలర్’తో రికార్డులు తిరగరాస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్.. విమర్శకుల ప్రశంసలు పొందుతున్నాడు. హేటర్స్ నుంచి లవ్ అండ్ అప్లాజ్ అందుకుంటున్నాడు. అయితే 73ఏళ్ల తలైవా.. ఈ చిత్రంలో అంత ఎనర్జిటిక్ అండ్ యంగ్‌గా కనిపించడం వెనుకున్న సీక్రెట్‌ను బయటపెట్టాడు అతని ఫ్రెండ్ రాజ్ బహదూర్. క్రమం తప్పకుండా హిమాలయాలకు వెళ్లే రజనీ.. అక్కడ సన్యాసులను కలిసి పూజలు చేస్తాడని.. వారు ఇచ్చే వేర్లు, తాయత్తుల కారణంగానే ఇంత పవర్‌ఫుల్‌గా ఉంటాడని చెప్పుకొచ్చాడు. ఒక్క మెడికల్ ట్యాబ్లేట్ వేసుకుంటే వారం రోజుల వరకు ఎనర్జీతో ఉంటారని వివరించాడు. అయితే అనారోగ్యం కారణంగా నాలుగేళ్లుగా హిమాలయాలకు వెళ్లని సూపర్ స్టార్.. ఈ ఇయర్ వెళ్లాడని, రిజల్ట్ సూపర్బ్‌గా ఉందని చెప్పుకొచ్చాడు రాజ్ బహదూర్.
Read More: హీరోయిన్‌కు గౌరవ డాక్టరేట్.. కానీ వైరల్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడటంతో..