రాజ్ తరుణ్ ఇద్దరు లవర్స్ సంచలన కాల్ రికార్డ్స్, స్క్రీన్ షాట్స్ వైరల్

టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్-లావణ్య ప్రేమ వ్యవహారం సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.

Update: 2024-07-06 02:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్-లావణ్య ప్రేమ వ్యవహారం సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ప్రేయసి లావణ్య నిన్న (జులై 5) రాజ్‌ తరుణ్‌‌పై నార్సింగ్ పోలీసు స్టేషన్‌లో కంప్లైట్ చేసిన విషయం తెలిసిందే. ‘‘నా ప్రపంచం.. రాజ్‌ నాకు కావాలి. రాజ్‌తరుణ్‌ నేను 11 ఏళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నాం. గుడిలో పెళ్లి కూడా చేసుకున్నాం. తన సినిమాలో నటిస్తున్న ఓ హీరోయిన్‌తో ఎఫైర్‌ పెట్టుకొని నన్ను దూరం పెట్టాడు. రాజ్ మూడు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఇక అప్పటినుంచి నాకు దూరంగానే ఉంటున్నాడు. రాజ్‌ను వదిలేయకపోతే చంపేసి బాడీ కూడా మాయం చేస్తామని కొంతమంది నన్ను బెదిరిస్తున్నారు. గతంలో నన్ను డ్రగ్స్‌ కేసులో కావాలనే ఇరికించారు. అరెస్టై 45 రోజులు జైల్లో ఉన్నాను. ఆ సమయంలో రాజ్‌ తరుణ్ నాకు ఎలాంటి సాయం చేయలేదు. నాకు పోలీసులే న్యాయం చేయాలి’’ అంటూ లావణ్య అనే యువతి ఫిర్యాదులో రాసుకొచ్చింది.

దీనిపై రాజ్ తరుణ్ స్పందించి.. లావణ్య మాటల్ని.. పచ్చి అబద్దాలన్నీ ఖండించాడు. ఇక రాజ్ తరుణ్ ప్రస్తుతం హీరోయిన్ మాల్హోత్రాతో రిలేషన్‌లో ఉన్నాడని లావణ్య చెప్పింది. కాగా గతంలో లావణ్య-మల్హోత్ర ఫోన్ లో మాట్లాడుకున్న కాల్ రికార్డ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా లావణ్య రిలీజ్ చేసిన ఈ కాల్ రికార్డ్స్ లో రాజ్ ను వదిలేయ్ నీ కాళ్లు పట్టుకుంటానని మల్హోత్రను లావణ్య అడిగింది. ఆయన నేను పెళ్లి చేసుకున్నాం. మేమిద్దరం చాలా ఏళ్లు కలిసి ఉన్నాం. ఇప్పుడు నీతో రిలేషన్ పెట్టుకున్నాడు. నా ఫోన్ నెంబర్ బ్లాక్ చేశారు. నువ్వు అన్ బ్లాక్ చేయమని చెప్పు. నువ్వు ఏం చెబితే అదే వింటున్నాడని, ఇలాంటి తప్పుడు దారిలో వెళ్తే భవిష్యత్తులో ఎదగలేరని మాల్వి మల్హోత్రను లావణ్య వార్నింగ్ ఇచ్చింది. అలాగే తరుణ్ తో మీ సిస్టర్ రిలేషన్‌లో ఉంది.. ఇది కరెక్ట్ కాదని మల్హోత్ర బ్రదర్‌కు లావణ్య మెసేజ్‌లు పెట్టింది. వీరిద్దరి మధ్య కూడా పెద్ద వివాదమే నెలకొంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన కాల్ రికార్డ్స్ , స్క్రీన్ షార్ట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


Similar News