టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న నిహారిక.. గీతా ఆర్ట్స్ నిర్మాణంలో సినిమా

సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన వారిలో నిహారిక ఎన్‌ఎం ఒకరు.

Update: 2024-07-04 14:59 GMT

దిశ, సినిమా: సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన వారిలో నిహారిక ఎన్‌ఎం ఒకరు. యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈమె.. కంటెంట్ క్రియేటర్‌గా పేరు తెచ్చుకోవడంతో ప్రజెంట్ సోషల్ మీడియాలో 6 మిలియన్ సబ్ స్కైబర్స్ ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ సినిమా ప్రమోషన్స్ చేయడంతో పాటు.. పలు ఈవెంట్స్, కార్యక్రమాల ద్వారా మంచి ఫేమ్ తెచ్చుకుంది.


అయితే.. అమ్మడు పుట్టిన రోజు కారణంగా తాజాగా ఓ స్పెషల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది ప్రముఖ నిర్మాణ సంస్థ. ఈ మేరకు నిహారిక నిహారిక ఎన్‌ఎం కు బర్త్‌డే విషెస్ తెలుపుతూ టాలీవుడ్‌లోకి వెల్కమ్ చెబుతూ పోస్ట్ చేసింది గీతా ఆర్ట్స్ సంస్థ. ఇక నిహారిక టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందని తెలుసుకున్న ఫ్యాన్స్.. ఆమెకు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని బ్లెస్ చేస్తున్నారు. 


Similar News