సింగర్ శ్రీరామచంద్రను పెళ్లి చేసుకోవాలని అతని ఇంటికి వెళ్లిన యువతి.. తర్వాత ఏం జరిగిందంటే?

టాలీవుడ్ సింగర్ శ్రీరామచంద్ర పాటలు పాడి అందరి మనసులో స్థానం సంపాదించుకున్నాడు.

Update: 2024-07-07 10:08 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ సింగర్ శ్రీరామచంద్ర పాటలు పాడి అందరి మనసులో స్థానం సంపాదించుకున్నాడు. అలాగే ఇండియన్ ఐడల్ విన్నర్‌గా ఫుల్ పాపులారిటీ తెచ్చుకుని.. బిగ్‌బాస్ రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా‌ పాల్గొన్నాడు. ఇక ఇంటి నుంచి బయటకు వచ్చాక సింగర్‌గా, నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీరామ చంద్ర షాకింగ్ విషయాన్ని వెల్లడించాడు. ‘‘గతంలో నేను ఇండియన్ ఐడల్ గెలిచిన తర్వాత మా ఇల్లు అందరికీ తెలిసిపోయింది. ఓ అమ్మాయి నా పేరుతో ఫేస్‌బుక్‌ అకౌంట్ ఉండగా.. చాట్ చేసింది.

అందులో పెళ్లి చేసుకుంటా వచ్చేయి అని మెసేజ్ పెట్టడంతో అన్ని సర్దుకుని మా ఇంటికి వచ్చేసింది. నేను అప్పుడు ఊర్లో లేను. మా అమ్మ నాకు ఫోన్ చేసి ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నావటగా అని చెప్పింది. నాకు అస్సలు గుర్తు రాలేదు. ఏమో నాకు తెలియదు అని చెప్పాను. ఆ తర్వాత మా అమ్మ ఆ అమ్మాయిని అడగడంతో ఫేస్‌బుక్ అకౌంట్ చూపించింది. దీంతో మా అమ్మకు అది ఫేక్ అకౌంట్ అని అర్థం అయింది. ఇక ఆ అమ్మాయిని కూర్చోబెట్టి భోజనం పెట్టి మరీ ఆమెకు అర్థం అయ్యేలా విషయాన్ని చెప్పి పంపించింది. మా వాడు ఎక్కడో ఉన్నాడు రావడానికి లేట్ అవుద్ది నువ్వు జాగ్రత్తగా వెళ్లమని చెప్పడంతో ఆమె వెళ్ళిపోయింది. ఆ తర్వాత మా అమ్మ నాకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది. అప్పుడు హమ్మయ్య అనుకున్నాను. ఈ సంఘటన జీవితంలో మర్చిపోలేను’’ అని చెప్పుకొచ్చాడు.


Similar News