భయపెడుతున్న శ్రద్ధా కపూర్.. ఓ స్త్రీ మమ్మల్ని కాపాడు అంటూ వేడుకుంటున్న అబ్బాయిలు

భయపెడుతున్న శ్రద్ధా కపూర్.

Update: 2024-07-07 09:05 GMT

దిశ,సినిమా : కల్కి మూవీతో సినిమా మార్కెట్ మళ్లీ పుంజుకుంది. థియేటర్ కి అసలు వెళ్ళని వాళ్లు కూడా సినిమా చూస్తున్నారంటే.. ఇక్కడే తెలిసిపోతుంది ప్రేక్షకుల్లో ఎంత మార్పు వచ్చిందో.. మరి ఇలాంటి సినిమాలు చూసిన తర్వాత సైలెంట్ గా ఉంటారా.. అసలు ఉండరు ఖచ్చితంగా కొత్త కంటెంట్ సినిమాల కోసం వేచి చూస్తారు. ఇదే క్రమంలో వచ్చిన ఒక మూవీ టీజర్ అందర్ని భయపెడుతుంది. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..

బాలీవుడ్ నటి శ్రద్ధ కపూర్ రాజ్‌కుమార్‌ రావ్, పంకజ్ త్రిపాటి ముఖ్య పాత్రలు చేసిన మూవీ ‘స్త్రీ 1’. 2018 లో రిలీజ్ అయి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్స్ ను బ్రేక్ చేసింది. ఈ చిత్రం హారర్-కామెడీ నేపథ్యంలో తెరకెక్కింది. అప్పటలోనే ఈ మూవీ రూ.180 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం 2018లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాలలో ఒకటిగా రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘స్త్రీ 2’ మన ముందుకు రాబోతుంది. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ మరోసారి ప్రధాన పాత్రలు పోషించారు. భారీ అంచనాలున్న ఈ సీక్వెల్ ఆగస్ట్ 15న మన ముందుకు రానుంది.

‘స్త్రీ 2’ టీజర్

తాజాగా ‘స్త్రీ 2’ టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. గోడలపై 'ఓ స్త్రీ మమ్మల్ని కాపాడు’ అంటూ రాసిన రాతలు అందర్ని భయపెడుతున్నాయి. శ్రద్ధా కపూర్ స్త్రీ పాత్రలో కనిపించబోతుంది. టీజర్ మధ్యలో నిశ్శబ్దకర సన్నివేశాలు, దెయ్యం హఠాత్తుగా కనిపించే చిత్రాలు వింతగా ఉన్నాయి. హారర్‌ జోనర్‌ ఎంజాయ్ చేసే వాళ్ళకి ఈ సినిమా మంచి అనుభూతిని ఇస్తుందని టీజర్‌ను బట్టి తెలుస్తోంది.

Full View


Similar News