జగన్ ఓటమితో చాలా హ్యాపీగా ఉన్నాం.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ సంచలన కామెంట్స్

ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏపీలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ దారుణ ఓటమిని చవి చూసింది.

Update: 2024-07-07 09:42 GMT

దిశ, సినిమా: ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏపీలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ దారుణ ఓటమిని చవి చూసింది. ఇక జగన్ ఓటమి పాలవ్వాలని ఏపీలో ఉన్న రాజకీయ పార్టీలతో పాటు, యావత్తు సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా కోరుకుంది. జగన్ ప్రభుత్వంలో సినీ ఇండస్ట్రీ అనేక ఇబ్బందులను ఫేస్ చేసిందని పలువురు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా టికెట్ల రేట్ల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయాల వల్ల పెద్ద సినిమాల నిర్మాతలు చాలా ఇబ్బంది పడ్డారు. పైగా మెగాస్టార్ చిరంజీవిని సైతం జగన్ అవమానించారని భావించిన సినీ ఇండస్ట్రీ ఎట్టి పరిస్థితుల్లో జగన్ తిరిగి విజయం సాధించ కూడదని భావించారు. దీనిలో భాగంగానే కూటమి అభ్యర్ధులకు బహిరంగంగానే ఇండస్ట్రీకి చెందిన పలువురు తమ మద్దతు ప్రకటించారు. ఇక అందరూ అనుకున్నట్టే జగన్ ఈ ఎన్నికల్లో ఓడిపోయారు.

ఇదిలా ఉండగా తాజాగా జగన్ ఓటమి గురించి కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్ రియాక్ట్ అయ్యారు. ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌తో దూసుకుపోతుంది. ఈ క్రమంలో నాగ్ అశ్విన్ మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రిపోర్టర్స్ అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.

ఒకవేళ ఏపీలో జగన్ తిరిగి గెలిచి ఉంటే అప్పుడు టికెట్ రేట్లు పెరిగేవి కాదు కదా. అప్పుడు మీ పరిస్థితి ఏంటని అడుగగా.. దానికి నాగ్ అశ్విన్‌.. అలా జరగలేదు కాబట్టే ఫుల్ హ్యాపీగా ఉన్నామని నాగ్ అశ్విన్‌ సమాధానం ఇచ్చారు. జగన్ పార్టీ ఓడిపోవడం వల్లే తమకు ఈ బెనిఫిట్ వచ్చి హ్యాపీగా ఉన్నామని మొహమాటం లేకుండా ఒక్క మాటలో తేల్చి చెప్పేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.


Similar News