ముత్యాల డ్రెస్‌‌లో మెరిసిపోతున్న రెజీనా కసండ్రా.. కుర్రాళ్లు ఫిదా

టాలీవుడ్ యంగ్ బ్యూటీ రెజీనా కసాండ్రా ‘శివ మనసులో శృతి’ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.

Update: 2024-07-07 08:50 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ రెజీనా కసాండ్రా ‘శివ మనసులో శృతి’ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత ఈ అమ్మడు టాలీవుడ్ యంగ్ హీరోలతో నటించి తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. తెలుగు ఇండస్ట్రీకి కాస్త గ్యాప్ ఇచ్చిన ఆమె షాకిని డాకిని మూవీతో చివరిసారిగా కనిపించింది. బాలీవుడ్‌లోనే వరుస మూవీస్ చేస్తూ ప్రేక్షకులన మెప్పిస్తోంది. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ విడాముయర్చి మూవీలో రెజీనా కసాండ్రా కీలక పాత్రలో కనిపించనుంది. అయితే ఈ అమ్మడు సినిమాలు చేస్తూనే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తోంది.

అలాగే తనకు సంబంధించిన విషయాలు తెలుపుతోంది. తాజాగా, రెజీన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ముత్యాల డ్రెస్సు‌లో ఉన్న బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేసింది. అందులో లైమ్ గ్రీన్ కలర్ లెహంగా ధరించి ఫొటోలకు పోజులిచ్చింది. అలాగే ఒక్కోసారి నాకు అర్థం కాని బాషలోని పాటను ప్రేమిస్తున్నాను. నాలోనూ కళాకారులు ఉన్నారని పిస్తోంది’’ అనే క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు ఫైర్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు. అలాగే సూపర్, గార్జియస్ అని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.


Similar News