బావలతో కంట్రోల్లో లేని నిహారిక.. అందుకే కాపురం కుప్పకూలింది..?
మెగా డాటర్ నాగబాబు గారాల పట్టి నిహారిక కొణిదెల గురించి పరిచయం అక్కర్లేదు.
దిశ, సినిమా: మెగా డాటర్ నాగబాబు గారాల పట్టి నిహారిక కొణిదెల గురించి పరిచయం అక్కర్లేదు. హీరోయిన్గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నిహారిక సినిమాల్లో సక్సెస్ అవ్వడం గురించి పక్కనపెడితే.. తన భర్తతో విడిపోయిందంటూ వస్తున్న పుకార్లతో రోజు వార్తల్లో నిలుస్తోంది. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ రకరకాల వార్తలు మాత్రం పుట్టుకొస్తున్నాయి. ఇక నిహారిక కూడా ఈ విషయంలో క్లారిటీ ఇవ్వకపోగా, డ్రెస్సింగ్ విషయంలో పూర్తిగా మారిపోయి.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఇక పోతే నిహారిక తన బావలతో చాలా క్లోజ్‌గా, జోవియల్‌గా ఉంటుంది. పలు ఫ్యామిలీ ఈవెంట్స్‌లోనూ వీడియోల్లో చూశాం కూడా.
ఇందులో భాగంగా నిహారిక ఓ ఇంటర్వూలో వైష్ణవ్ తేజ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది. ‘వైష్ణవ్ నాకంటే వన్ ఇయర్ చిన్న వాడు అంతే. కానీ వాడిని చూసిన ప్రతీసారి ముందు వీపుపైకి ఉప్పు ఎక్కాలనిపిస్తుంది. అలా అలవాటైపోయింది. వాడు కూడా ఏం అనడు పాపం. మా ఇద్దరికి మంచి బాండింగ్ ఉంది. నేను యాక్టర్ అవ్వాలని అనుకుంటున్నారని అతనికే ముందు తెలుసు’ అంటూ చెప్పుకొచ్చింది నిహారిక. దీంతో ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్స్.. బావ వరుస అయినవాళ్లతో ఇలా ఉండబట్టే కాపురం కుప్పకూలింది, భర్తకు దూరమయ్యావు అని తిట్టిపోస్తున్నారు.
Also Read...
మెగా ఫ్యామిలీ ఇంట్లో సంబరాలు.. రేపు రాబోతున్న కొత్త బంధువు..!