అక్కినేని ఫ్యామిలీ ఫొటోలో ఆ స్టార్ హీరోయిన్ కూతురు.. ఎందుకు ఉన్నదో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

అక్కినేని ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే తమకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

Update: 2024-09-21 06:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే తమకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే రీసెంట్‌గా లెజండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరావు(Akkineni Nageshwarao) 100 సంవత్సరాల వేడుకను అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని కుటుంబం ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా అక్కినేని విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అక్కినేని వారసులందరూ కలిసి ఓ ఫోటో కూడా దిగారు. కానీ అందులో ఓ స్టార్ హీరోయిన్ కూతురు కూడా ఉండటం గమనార్హం. అసలు ఆమె ఎందుకు ఆ ఫొటోలో ఉందని జనాలు షాక్ అవుతున్నారు. మరి ఆమె ఉండటానికి గల కారణం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. వివరాల్లోకి వెళితే..

తాజాగా సోషల్ మీడియాలో అక్కినేని 100 సంవత్సరాల వేడుకలో అక్కినేని వారసులందరూ దిగిన ఫొటో ఒకటి తెగ వైరల్ అవుతుంది. అందులో అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna)- అక్కినేని అమల(Akkineni Amala).. వారి కుమారులు అక్కినేని నాగ చైతన్య(Akkineni Nagachaithanya), అక్కినేని అఖిల్(Akkineni Akhil). ఇక నాగార్జున అన్న అక్కినేని వెంకట్- అక్కినేని జ్యోత్స్న.. వారి పిల్లలు. ఇక నాగ్ సోదరి నాగ సుశీల.. ఆమె కొడుకు సుశాంత్(Sushanth). ఇంకో సోదరి సరోజా అక్కినేని కొడుకు సుమంత్(Sumanth) , కూతురు సుప్రియ(Supriya).. ఇంకో సోదరి సత్యవతి పిల్లలు.. వారి పిల్లలు కూడా కనిపించారు. అయితే ఈ ఫ్యామిలీ ఫొటోలో అక్కినేని కుటుంబానికి సంబంధం లేని ఒక మహిళ ఉండడం విశేషం. ఇంతకీ ఆమె మరెవరో కాదండోయ్ మహానటి సావిత్రి(Savithri) కుమార్తె విజయ చాముండేశ్వరి(Vijaya Chamundeshwari). సావిత్రి బయోపిక్ మహానటి(Mahanati) సినిమా తర్వాత విజయ చాముండేశ్వరి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో ఇంటర్వ్యూలలో తల్లి గురించి ఎన్నో విషయాలను పంచుకుంది. ఇక ఏఎన్నార్ 100 ఇయర్స్ వేడుకకు ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసింది. వేడుక అనంతరం ఆమె అక్కినేని ఫ్యామిలీ ఫొటోలో ఇదిగో ఇలా కలిసిపోయింది. దీంతో ఈ పిక్ కాస్త వైరల్ అయిపోయింది.



Similar News