కారు ప్రమాదంలో హీరోయిన్ భర్తకు తీవ్ర గాయాలు.. !

బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింగ్వాని భర్త పర్వీన్ దబాస్‌కు శనివారం ఉదయం కారు ప్రమాదం జరిగినట్లు సమాచారం.

Update: 2024-09-21 07:25 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింగ్వాని భర్త పర్వీన్ దబాస్‌కు శనివారం ఉదయం కారు ప్రమాదం జరిగినట్లు సమాచారం. దీంతో ఆయనను హూటాహుటిన బ్రాద్రాలోని హోలీ ఫ్యామిలీ హాస్పిటల్‌కు తరలించారు. ప్రజెంట్ పర్వీన్ ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ విషయం తెలుసుకున్న ప్రీతి హాస్పిటల్‌కు వెళ్లింది. అతని కుటుంబ సభ్యులతో పాటు ప్రో పంజా లీగ్ మెంబర్స్ కూడా హాస్పిటల్‌లో ఉన్నట్లు సమాచారం. పర్వీన్ యాక్సిడెంట్ గురించి పలు వార్తలు వస్తుండటంతో అంతా ఆందోళన చెందుతున్నారు.

ఈ క్రమంలోనే ప్రో పంజా లీగ్ సభ్యులు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో వెల్లడించారు. పర్వీన్ చికిత్సకు రెస్పాండ్ అవుతున్నారు. ఆరోగ్య పరిస్థితి గురించి అప్డేట్స్ ఇస్తామని తెలపడంతో అతను తొందరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు. కాగా, పర్వీన్ నటుడు, దర్శకుడు, ప్రో పంజా లీగ్ కో ఫౌండర్ కూడా అని తెలుస్తోంది. ఇక ప్రీతి తెలుగులో తమ్ముడు, నరసింహ నాయుడు సినిమాల్లో నటించి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. కెరీర్‌ పీక్స్‌లో ఉండానే వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు టాక్. ప్రజెంట్ ఈ జంట సినిమా ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.


Similar News