Nagarjuna Akkineni: అప్పటి వరకు అఖిల్ ఫ్యాన్స్ ముందుకు రాడు.. నాగార్జున షాకింగ్ కామెంట్స్
అప్పటి వరకు అఖిల్ ఫ్యాన్స్ ముందుకు రాడు
దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని నాగార్జున రెండో కొడుకు అఖిల్ తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. 'అఖిల్' అనే మూవీతో మన ముందుకు వచ్చాడు. ఫస్ట్ మూవీతోనే పెద్ద ఫ్లాప్ అందుకున్నాడు.. ఇక దాంతో చాలా మంది యాక్టింగ్ రాదు .. ఏం రాదంటూ విమర్శలు చేసారు. భారీ అంచనాల నడుమ వచ్చినా ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఆ తర్వాత వచ్చిన సినిమాలు కూడా హిట్ అవ్వలేదు.
ప్రస్తుతం హిట్ కొట్టాలని చాలా ఆశ పడుతున్నాడు. అలాంటి ప్రాజెక్ట్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాడు. ఈ హీరో ఫ్యాన్స్ ముందుకు రాక ఏడాది అవుతుంది. ఫ్యామిలీ ఈవెంట్స్ లోనూ అఖిల్ జాడ లేదు. తాజాగా అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలను గ్రాండ్‌గా చేసారు.
ఇంత ముఖ్యమైన ఈవెంట్ కు కూడా అఖిల్ రాలేదు. " హిట్టు కొట్టిన తర్వాతనే అభిమానుల ముందుకి వస్తానని చెప్పాడు. అలాగే మీ అందరిని అడిగినట్లు చెప్పమన్నాడు' అంటూ నాగార్జున చెప్పుకొచ్చాడు. ఇప్పుడు నాగార్జున చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ సారైనా అఖిల్ కు హిట్ కొడతాడా? లేదనేది చూడాలి.