ఆ మాటలు వింటే మేము నగ్నంగా ఉన్నట్లే అనిపిస్తుంది: నర్గీస్ ఫక్రీ

జీవితంలోని కొన్ని వ్యక్తిగత అంశాలను సీక్రెట్‌గానే ఉంచాలనుకుంటున్నట్లు నటి నర్గీస్ ఫక్రీ చెప్పింది.

Update: 2022-12-11 10:24 GMT
ఆ మాటలు వింటే మేము నగ్నంగా ఉన్నట్లే అనిపిస్తుంది: నర్గీస్ ఫక్రీ
  • whatsapp icon

దిశ, సినిమా : జీవితంలోని కొన్ని వ్యక్తిగత అంశాలను సీక్రెట్‌గానే ఉంచాలనుకుంటున్నట్లు నటి నర్గీస్ ఫక్రీ చెప్పింది. ఇటీవల సోషల్ మీడియా కారణంగా పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ప్రతి విషయాన్ని ఫొటో, వీడియోల రూపంలో విచ్చలవిడిగా పబ్లిక్‌తో పంచుకునే సంస్కృతి పెరిగిపోయిందని వాపోయింది. ముఖ్యంగా నటీనటుల వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం గురించి తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారన్న ఆమె.. తన డేటింగ్ లైఫ్ గురించి ఎవరైన అడిగినప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుందని వెల్లడించింది.

అలాగే 37 ఏళ్ల టోని బేగ్‌తో ప్రేమలో ఉన్నట్లు వచ్చిన పుకార్లను కొట్టిపారేసింది. 'నా వేలికి ఉంగరం కనిపించేంత వరకూ నేను ఒంటరిగా ఉన్నట్లే. ఎల్లప్పుడూ నిజాయితీపరురాలిగానే ఉంటాను. నా పర్సనల్ జీవితం గురించి మాట్లాడటానికి సిగ్గుపడను. అయితే జనాలు ముఖ్యమైన అంశాలకు బదులుగా పనికిరాని గాసిప్స్ హైలైట్ చేయడం చిరాకుగా ఉంటుంది. కాబట్టి దానికంటే ముందు నా పనిని ఉన్నతంగా చూపించాలనుకుంటాను' అని స్పష్టం చేసింది. చివరగా నటీనటుల గోప్యతను నెటిజన్లు ఉల్లంఘించినపుడు దాదాపు నగ్నంగా ఉన్నట్లు అనిపిస్తుందన్న ఆమె 'మనం ఇతరులను గౌరవిస్తూ.. వాళ్లతో గౌరవించబడాలి' అని సూచించింది.


మంచి భర్త దొరికితే చాలు.. కెరీర్‌కు ఎలాంటి భయం లేదంటున్న.. Yami Gautam !

Tags:    

Similar News