Matka: మట్కా టీజర్ డేట్ ఫిక్స్.. హైప్ పెంచేస్తున్న మెగా హీరో పోస్ట్
మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మట్కా’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.
దిశ, వెబ్‌డెస్క్: మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను వైర ఎంటర్టైన్మెంట్స్, ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇక పీరియాడిక్ డ్రామాగా రానున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరికొత్త మేకోవర్‌తో కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ పోస్టర్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. కాగా, ఇప్పుడు ఈ సినిమా నుంచి టీజర్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో మట్కా టీజర్‌ను అక్టోబర్ 5న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ఓ పోస్టర్ ద్వారా వెల్లడించారు. దీనిని మెగా హీరో తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేయడంతో ఈ మూవీపై హైప్ పెరిగిపోయింది. కాగా ఈ సినిమాలో అందాల భామలు మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ.. నవంబర్ 14న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నది.