Ram Charan: ‘గేమ్ చేంజర్’ అప్డేట్ ఇచ్చిన తమన్.. ఖుషీలో మెగా ఫ్యాన్స్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న తాజా చిత్రం ‘గేమ్ చేంజర్’.

Update: 2024-10-04 10:20 GMT

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న తాజా చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ మూవీ గత రెండున్నర ఏళ్ల నుంచి షూటింగ్ జరుపుకుంటోంది కానీ విడుదల నోచుకోలేదు. అయితే దీనిని శంకర్ తెరకెక్కిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజ్, శిరీష్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అంజలి, ఎస్ జే సూర్య, శ్రీకాంత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గేమ్ చేంజర్ మూవీ డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విడుదల సమయం దగ్గర పడుతుండటంతో గేమ్ చేంజర్ మేకర్స్ ప్రమోషన్స్ మొదలెట్టారు.

ఇందులోంచి పాటలను విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. తాజాగా, గేమ్ చేంజర్‌కు మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న తమన్ ఇందులోంచి థర్డ్ సాంగ్ రాబోతున్నట్లు ‘X’ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ‘‘ఈ సారి మెలోడి పాట రాబోతుంది. అక్టోబర్‌లో విడుదల కానుంది. ఈ సాంగ్ అందరి హృదయాలను కట్టిపడేస్తుంది’’ అని రాసుకొచ్చారు. అంతేకాకుండా నవంబర్‌లోనూ ఒక అప్డేట్ ఉన్నట్లు వెల్లడించారు. కానీ డేట్స్ మాత్రం చెప్పలేదు. అయినప్పటికీ ఈ విషయం తెలుసుకున్న రామ్ చరణ్ ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీ అవుతున్నారు.


Similar News