Devara box office collection day 7: బాక్సాఫీసు వద్ద ‘దేవర’ సునామీ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వచ్చిన మూవీ ‘దేవర’. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా.. భైరా పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ నటించారు.

Update: 2024-10-04 11:03 GMT

దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన మూవీ ‘దేవర’. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా.. భైరా పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ నటించారు. అయితే ‘దేవర’ చిత్రం సెప్టెంబర్ 27న థియేటర్స్‌లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ దక్కించుకుంది. అంతేకాకుండా మొదటి రోజే రూ. 172 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టించింది.

దేవర చిత్రం వారం రోజుల్లోనే బాక్సాఫీసు వద్ద సునామీ సృష్టించింది. తాజాగా, చిత్ర బృందం ఇదే విషయాన్ని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ‘దేవర’కు వచ్చిన కలెక్షన్లు రివీల్ చేస్తూ X వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ఈ మూవీ రూ. 405 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు అధికారికంగా వెల్లడించారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఆనందపడుతున్నారు. అలాగే మరికొన్ని రోజుల్లోనే దేవర రూ. 1000 కోట్లు వసూల్ చేస్తుందని అభిప్రాయపడుతున్నారు.

 


Similar News