Alia Bhatt: అలియా భట్, బాబీ డియోల్ ‘ఆల్ఫా’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, శార్వరి వాఘులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఆల్ఫా’.

Update: 2024-10-04 09:41 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, శార్వరి వాఘులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఆల్ఫా’. ఇందులో బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాను డైరెక్టర్ శివ్‌రవైల్ తెరకెక్కిస్తుండగా.. దీనిని అగ్ర నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ స్పై యూవీవర్స్‌లో అదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. ఇందులో అలియా, బాబీ మధ్య భారీ యాక్షన్ సీన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్‌ల సమక్షంలో యుద్ధపోరాట సన్నివేశాలను షూట్ చేస్తున్నట్లు సమాచారం.

తాజాగా, ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ‘ఆల్ఫా’ మూవీ వచ్చే ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న తెలుగు, హిందీ, తమిళంలో విడుదల కానున్నట్లు అలియా భట్ ‘X’ వేదికగా పోస్ట్ పెట్టింది. అంతేకాకుండా ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. అయితే ఈ చిత్రం యశ్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్‌లో వస్తున్న ఏడో సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.


Similar News