Kalki -2.. చేంజ్ కాబోతున్న మ్యూజిక్ డైరెక్టర్.. ఈసారి ఇంటర్నేషనల్ లెవల్..

కల్కి సినిమా ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఎన్నో రికార్డులు కొల్లగొట్టింది. మరో పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ సక్సెస్ ప్రభాస్ ఖాతాలో పడిపోయింది. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ కల్కి యూనివర్స్ సెకండ్ పార్ట్

Update: 2024-06-30 15:15 GMT

దిశ, సినిమా: కల్కి సినిమా ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఎన్నో రికార్డులు కొల్లగొట్టింది. మరో పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ సక్సెస్ ప్రభాస్ ఖాతాలో పడిపోయింది. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ కల్కి యూనివర్స్ సెకండ్ పార్ట్ కూడా ఇప్పటికే 60 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకోగా.. త్వరలో దీనిపై మరింత క్లారిటీ ఇస్తామని ప్రకటించారు మేకర్స్. ఏడాదిలోపు సీక్వెల్ తో పలకరిస్తామని ప్రేక్షకులకు హామీ ఇచ్చారు. ఇక అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక లాంటి స్టార్స్ నటించిన మూవీని పాన్ వరల్డ్ గా ప్లాన్ చేశారు. అదే రేంజ్ లో రిలీజ్ చేశారు. అయితే అన్ని కేటగిరీలలో సక్సెస్ అయిన మూవీ మ్యూజిక్ విషయంలో మాత్రం కాస్త డిజప్పాయింట్ చేసిందని రివ్యూస్ వచ్చాయి.

దీంతో సెకండ్ పార్ట్ లో మ్యూజిక్ డైరెక్టర్ ను మార్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. సంతోష్ నారాయణ్ కు బదులు ఆస్కార్ అవార్డ్ గ్రహీత కీరవాణి వర్క్ చేస్తాడని టాక్. కానీ ప్రస్తుతం ఆయన మహేష్ బాబు - రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నట్లు సమాచారం. ఆ ప్రాజెక్ట్ పూర్తి అయ్యాకే కల్కి సెకండ్ పార్ట్ బాధ్యతలు తీసుకుంటాడని తెలుస్తుంది. జక్కన్న ప్రాజెక్ట్ అంటే ఏళ్లు పడుతుంది. కాబట్టి కీరవాణి ముందు కల్కి సినిమాకు సంగీతం సమకూరుస్తాడా లేక నో చెప్తాడా అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది.

Similar News