అమ్మనాన్నలైన జబర్దస్త్ కపుల్..! శుభవార్తను గోప్యంగా ఉంచడానికి కారణం అదేనా..?

జబర్దస్త్ కపుల్ అయిన రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాతల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2024-10-04 09:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: జబర్దస్త్ కపుల్ అయిన రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాతల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని నెలల క్రితం వీరు.. తాము తల్లిదండ్రులు కాబోతున్నాము అంటూ ఇన్‌స్టా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి సుజాత బేబీబంప్ ఫొటోస్, శ్రీమంతం ఫొటోస్‌ను రాకింగ్ రాకేష్ పోస్ట్ చేస్తునే ఉన్నాడు. ఇలా ఆమెకు సంబంధించిన ప్రతి విషయాన్ని షేర్ చేసిన రాకేష్.. సుజాత డెలివరీ అయిన విషయాన్ని మాత్రం షేర్ చేయలేదు. తమకు బిడ్డ పుట్టినట్లు ఇప్పటివరకు అధికారికంగా బయటకు చెప్పలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వీరిద్దరు అమ్మనాన్నలయ్యారని పోస్టులు దర్శనమిస్తున్నాయి. అయితే రీసెంట్‌గా సుజాత ఇన్‌స్టాలో బతుకమ్మను పట్టుకొని ఫొటోలకు పోజులిచ్చింది. అందులో ఆమె టమ్మి కనిపించలేదు. దీంతో నెటిజన్లు.. ‘డెలివరీ అయిన విషయాన్ని ఎందుకు దాచి పెడుతున్నారు మేడమ్?’ ‘బాబు పుట్టాడా? పాప పుట్టిందా’ అంటూ ప్రశ్నిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి వీరు ఈ విషయాన్ని ప్రకటించకపోవడానికి ఉన్న కారణం ఏంటంటే.. ఒకేసారి బేబీ ఫొటోతో రివీల్ చేసి సర్‌ఫ్రైజ్ చేద్దామని అనుకుంటున్నారట. ఏది ఏమైనప్పటికి ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.

కాగా జబర్దస్త్‌లో రాకింగ్ రాకేష్- జోర్దార్ సుజాత జంటగా బోలెడు స్కిట్లు చేసి ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్వించారు. ఆ తర్వాత ఇదే జబర్దస్త్ వేదికపై తమ ప్రేమ విషయాన్ని బయట పెట్టారు. పెద్దల అనుమతితో గత ఏడాది ఫిబ్రవరిలో తిరుమల శ్రీవారి సాక్షిగా ఏడడుగులు వేశారు. ఇప్పుడు తమ వైవాహిక బంధానికి ప్రతీకగా ఒక పండంటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించారు ఈ క్యూట్ కపుల్.

(video link credits to jordar sujatha instagram id)


Similar News